అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ‘‘ ఈబీసీ రిజర్వేషన్ బిల్లును’’ కేంద్రప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మధ్యాహ్నం సభ ప్రారంభమైన వెంటనే కేంద్రమంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లను 50 శాతానికి మించి అమలు చేయరాదు.. దీనికి అడ్డుగా ఉన్న అధికరణను సవరించేందుకు వీలుగా 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. బిల్లు ఆమోదం పొందడానికి 2/3 సభ్యుల మెజారిటీ అవసరం. లోక్‌సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నందున బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.