కేంద్ర బడ్జెట్ 2020-21: ఖరగ్‌పూర్- విజయవాడ మధ్య ఈస్ట్‌కోస్ట్ సరుకు రవాణా కారిడార్

తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకొని వస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

east  north goods special transport corridors will be started 2022 june:nirmala sitaraman lns

న్యూఢిల్లీ: తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకొని వస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

సోమవారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

ఇందులో భాగంగా ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు రైల్వే సౌకర్యాలకు రూ. 1,01,055 కోట్లు కేటాయిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.

మరోవైపు త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు రాష్ట్రంలో మెట్రో రైల్వేకు కేంద్రం రూ. 63 వేల కోట్లను కేటాయిస్తున్నట్టుగా తెలిపింది. బెంగుళూరు మెట్రోకు రూ. 14, 788 కోట్లు కేటాయించినట్టుగా కేంద్రం ప్రకటించింది.

రూ. 18వేల కోట్లతో బన్ ట్రాన్స్ పోర్ట్ పథకం, వాహనరంగం అభివృద్దికి చర్యలు చేపట్టనున్నట్టుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో వైపు కేరళ రాష్ట్రంలోని కొచ్చి మెట్రో రెండో దశకు కూడ కేంద్రం సహాయం చేయనున్నట్టుగా ప్రకటించింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios