అసోంలోని నగావ్‌లో ఆదివారం సాయంత్రం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. 

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. సాయంత్రం 4.18 గంటలకు రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. దీంతో కొన్ని చోట్ల ప్రజలు పరుగులు తీశారు. అయితే, ఇప్పటి వరకు ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవించిన ఘటనలేవీ రిపోర్ట్ కాలేవు. అసోంలోని నగావ్‌లో ఆదివారం ఈ భూకంపం చోటుచేసుకుంది.

ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ట్విట్టర్‌లో ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 2వ తేదీన సాయంత్రం 4.18 గంటలకు 4.0 తీవ్రతతో అసోంలోని నగావ్‌లో భూమి కంపించిందని వివరించింది. 

Scroll to load tweet…

ఇంతకు ఒక రోజు ముందే గుజరాత్‌లోని సూరత్‌లో 3.8 తీవ్రతతో భూమి కంపించింది. రాత్రిపూట 12.52 గంటలకు చోటుచేసుకున్నట్టు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెస్మలాజికల్ రీసెర్చ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

సోమవారం టర్కీలో శక్తివంతమైన భూప్రళయం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి విలయంలో వేలాదిమంది మరణించారు. లక్షలాదిమంది నిరాశ్రయులుగా మారారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భూకంప ప్రభావంతో టర్కీ దేశం తన స్థానం నుంచి మూడు అడుగుల (10 మీటర్లు) వరకు పక్కకు జరిగి ఉండవచ్చని ఒక నిపుణుడు పేర్కొన్నారు. ఇటాలి యన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ, టర్కీ పశ్చిమం వైపు "సిరియాతో పోలిస్తే ఐదు నుండి ఆరు మీటర్లు దూరం జరిగే అవకాశం ఉంది" అని చెప్పారు.