మణిపూర్‌లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. ఉఖ్రుల్ జిల్లాలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది.
మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ఈ సమాచారాన్ని ఇచ్చింది. NCS ప్రకారం.. ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం రాత్రి 11.01 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.1 గా నమోదు కాగా.. భూకంపం లోతు 20 కి.మీ.గా నమోదైంది. అలాగే.. సోమవారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 70 కిలోమీటర్ల లోతులో నమోదైంది. అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతకు ముందు.. టిబెట్‌లోని జిజాంగ్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 5.40 గంటలకు ఈ భూకంపం సంభవించింది. అలాగే.. ఇండోనేషియాలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెప్టెంబర్ 11న ఇండోనేషియాలో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. మలుకు ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించింది.
మొరాకోలో భారీ విధ్వంసం సృష్టించిన భూకంపం
సెప్టెంబర్ 8న మొరాకోలో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,600 దాటింది, 2,500 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భూకంపం కారణంగా భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హై అట్లాస్ పర్వతాల లోయలలో ఉన్న గ్రామాలు చాలా నష్టాన్ని చవిచూశాయి.
