గుజరాత్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది.

గుజరాత్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. ఈరోజు ఉదయం భూకంపం సంభవించినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వివరాలు వెల్లడించింది. భూకంప కేంద్రం గుజరాత్‌లోని సూరత్‌కు ఆగ్నేయంగా 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 10.26 గంటలకు 7 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా నివేదించబడలేదు.

Scroll to load tweet…