Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రత నమోదు

దేశంలోని పలు ప్రాంతాల్లో  భూకంపం  చోటు  చేసుకుంది.  ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ , హర్యానా రాష్ట్రాల్లో  భూమి కంపించింది.

Earthquake Of 4.4 Magnitude Shakes Delhi-NCR And Parts Of UP
Author
First Published Feb 22, 2023, 3:06 PM IST


న్యూఢిల్లీ:  దేశంలోని పలుప్రాంతాల్లో  బుధవారంనాడు భూకంప్రకపనాలు చోటు  చేసుకున్నాయి.  ఉత్తర్ ప్రదేశ్,  ఢిల్లీ , ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు  రాష్ట్రాల్లో   భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై  4.4 గా తీవ్రత నమోదైంది.  హరిద్వార్ లో  భూకంప కేంద్రం  ఉందని  అధికారులు  తెలిపారు. భూమికి  పది కిలోమీటర్ల లోతులో  భూకంప కేంద్రం ఉందని  అధికారులు గుర్తించారు.

  భూకంపం కారణంగా  స్థానికులు  ఆందోళన చెందారు.  భూమి కంపించడంతో  ప్రజలు భయంతో  ఇళ్ల నుండి  బయటకు పరుగులు తీశారు.  మరో వైపు నేపాల్ లో  ఇవాళ  5.2 తీవ్రతతో భూమి కంపించింది. నేపాల్ లో  జుమ్లాకు  69 కి.మీ  దూరంలో భూకంపం వాటిల్లింది.  

 2022 నవంబర్ మాసంలో  నేపాల్ లో  6.2 తీవ్రతతో భూకంపం వాటిల్లింది.   దోటి జిల్లాలో  ఇల్లు కూలిన ఘటనలో  ఆరుగురు మృతి చెందారు. ఢిల్లీ ఎన్ సీఆర్  ప్రాంతాల్లో  కూడా  భూకంపం వచ్చింది.  దేశంలోని  ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో  త్వరలో  భూకంపాలు  వచ్చే  అవకాశం ఉందని   భూగర్భశాస్త్రవేత్తలు హెచ్చరించారు.  అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో  ఈ నెల  19వ తేదీన  భూకంపం  వచ్చింది.  ఈ నెల  17న  జమ్మూ కాశ్మీర్ లోని కత్రాలో   భూకంపం వాటిల్లింది. సిక్కింలో  ఈ నెల  13న  భూకంపం చోటు  చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios