Sonitpur: అస్సాంలోని పలు ప్రాంతాల్లో 3.6 తీవ్రతతో భూకంపం సంభ‌వించింది. అస్సాంలోని సెంట్రల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింద‌నీ, అయితే ఈ భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఎవరికీ ఎలాంటి ప్రాణ, గాయాలు, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికార వ‌ర్గాలు తెలిపాయి. భూకంప తీవ్రత 5 కిలోమీటర్లలో ఉందని పేర్కొన్నారు.  

Assam Earthquake: అస్సాంలోని పలు ప్రాంతాల్లో 3.6 తీవ్రతతో భూకంపం సంభ‌వించింది. అస్సాంలోని సెంట్రల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింద‌నీ, అయితే ఈ భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఎవరికీ ఎలాంటి ప్రాణ, గాయాలు, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికార వ‌ర్గాలు తెలిపాయి. భూకంప తీవ్రత 5 కిలోమీటర్లుగా ఉందని పేర్కొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. అస్సాంలోని సెంట్రల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎవరికీ ఎలాంటి ప్రాణ, గాయాలు, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని తెలిపింది. బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున సోనిత్పూర్ జిల్లాలో ఉదయం 11:35 గంటలకు భూ ప్ర‌కంప‌న‌లు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదిక తెలిపింది. భూకంప తీవ్రత 5 కిలోమీటర్లుగా ఉందని పేర్కొంది. ఉత్తర మధ్య అస్సాంలోని తేజ్ పూర్ పట్టణానికి సమీపంలో గౌహతికి ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మైన ఉన్నట్లు గుర్తించారు.

బ్రహ్మపుత్ర నది దక్షిణ ఒడ్డున ఉన్న మోరిగావ్, నాగావ్, పశ్చిమ కర్బి అంగ్లాంగ్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న దర్రాంగ్, లఖింపూర్, ఉదల్గురి జిల్లాల్లో కూడా భూప్రకంపనల ప్ర‌భావం క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి ప్ర‌జ‌లు కొద్ది సేపు ఏం జ‌రుగుతుందోన‌ని ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కాగా, ఈశాన్య భార‌త‌ రాష్ట్రాలు అధిక భూకంప జోన్ పరిధిలోకి వస్తాయ‌నీ, ఈ ప్రాంతాన్ని తరచుగా భూకంపాలు తాకుతాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Scroll to load tweet…