ఉత్తరాఖండ్ లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో సోమవారం అర్ధరాత్రి 1.50 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.1గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది.

ఉత్తరాఖండ్‌లో అర్థరాత్రి భూకంపం సంభవించింది. ఉత్తరకాశీలో సోమవారం(డిసెంబర్19,2022) అర్ధరాత్రి 1.50 గంటల ప్రాంతంలో భూకంపం కారణంగా భూమి కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. భూకంప తీవ్రత 3.1 తీవ్రతతో ఉంది. ఉత్తరకాశీకి 24 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూమి కదలికలు సంభవించినట్టు వెల్లడించింది.భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం యొక్క తక్కువ లోతు కారణంగా ప్రకంపనలు సంభవించాయి.
నెల రోజుల క్రితం కూడా భూకంపం
ఉత్తరాఖండ్‌లో నెల రోజుల క్రితం కూడా భూకంపం సంభవించింది. ఆ సమయంలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం ఏర్పడి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది.
మరోవైపు నేపాల్ కూడా భూమి కంపించినట్టు వార్తలు వస్తోన్నాయి. ఆదివారం రాత్రి 10.53 గంటలకు ధాడింగ్ జిల్లాలో 4.5 తీవ్రత భూకంపం వచ్చిందని నేపాల్ ఎర్త్ క్వేక్ మానిటరింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్ తెలిపింది. కఠండూకి 50 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు పేర్కొంది.