తమిళనాడులో భూకంపం
తమిళనాడులో శుక్రవారం ఉదయం భూకంపం వణికించింది.
చెంగల్పట్టు : తమిళనాడును ప్రకృతి వైపరీత్యాలు వదలడం లేదు. నిన్నటివరకు మిచాంగ్ తుపాన్ అల్లకల్లోలం చేసింది. తమిళనాడు రాజధాని చెన్నై ఇంకా దీనినుంచి కోలుకోలేదు. అప్పుడే మరో ప్రకృతి వైపరీత్యం విరుచుకుపడింది. తమిళనాడులోని చెంగల్పట్టులో శుక్రవారం ఉదయం 7.30గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది భూమికి పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమయ్యింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఎక్స్ వేదికగా సమాచారం ఇచ్చింది.