దేశ రాజధాని ఢిల్లీని వరుస భూప్రకంపనలు వణికిస్తున్నాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది.

మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రకంపనలు కొనసాగాయి. ఇంట్లోని సామాన్లు కదలడంతో ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు. గురుగ్రామ్‌కు నైరుతి దిశగా 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

అయితే గతంలో వచ్చిన ప్రకంపనల కంటే ఈరోజు వచ్చిన భూకంపం అధికంగా ఉందని ఢిల్లీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు దేశం మొత్తం కరోనా వైరస్‌తో వణికిపోతుంటే.. ఈ భూప్రకంపనల వార్త ప్రజలను హడలెత్తించింది.