జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3గా నమోదు అయ్యింది. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు.
జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం ఉదయం ఒక్క సారిగా భూమి కంపించింది. లడఖ్ ప్రాంతం లేహ్ జిల్లాలోని అల్చి గ్రామానికి ఉత్తరాన 186 కిలోమీటర్ల దూరంలో ఉదయం 7.29 గంటలకు ఈ భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.3గా నమోదు అయ్యింది. ‘‘ జమ్మూ కాశ్మీర్‌లోని అల్చి (లేహ్) ఉత్తర ప్రాంతంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ట్వీట్ చేసింది.‘‘ 29-03-2022వ తేదీన ఉదయం 07:29:39, లాట్ : 35.87, పొడవు : 77.47, లోతు: 148 కి.మీ., స్థానం: ఆల్చి (లేహ్), జమ్మూకి 186 కిలో మీటర్ల దూరంలో 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. ’’ అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఆ ట్వీట్ లో పేర్కొంది.
మంగళవారం ఉదయం ఉన్నట్టుండి ఒక్క సారిగా భూమి కదలడంతో స్థానికులు ఆందోళన చెందారు. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్టు సమాచారం లేదు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
