Asianet News TeluguAsianet News Telugu

ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత నమోదు..

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపం తీరంలో నేటి తెల్లవారుజామున 6.2 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టమూ జరగలేదు. 

Earthquake in Indonesia.. 6.2 magnitude on the Richter scale..
Author
First Published Jan 16, 2023, 9:10 AM IST

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం తీరంలో సోమవారం తెల్లవారుజామున 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. అచే ప్రావిన్స్‌లోని సింగ్‌కిల్ నగరానికి దక్షిణ-ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల (30 మైళ్లు) దూరంలో 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది.

ఢిల్లీలో మరో కోల్డ్ స్పెల్... నేటినుంచి రెండు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు..

ఈ భూప్రకంపనలు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు (2230 జీఎంటీ) సంభవించింది. అయితే ఈ ప్రకంపనలతో సునామి ముప్పు లేదని ఇండోనేషియా వాతావరణ శాస్త్రం, క్లైమాటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిపాయి. ‘‘ భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. అచే, ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో ఇది 3-10 సెకన్ల మధ్య ప్రకంపనలను రేకెత్తించింది. ’’ అని బీఎన్ పీబీ విపత్తు ఉపశమన సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి ఒక ప్రకటనలో తెలిపారు.

"దానిని తప్పుపట్టవద్దు...": భారత్ జోడోపై కమల్ హాసన్ రియాక్షన్

ఇండోనేషియా పసిఫిక్ లోని రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగా తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. అగ్నిపర్వతాల పేలుడు జరుగుతాయి. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటాయి. కాగా.. గతేడాది నవంబర్ 21వ తేదీన జావా ప్రధాన ద్వీపంలోని పశ్చిమ జావా ప్రావిన్స్‌లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించి 602 మంది మరణించారు. భవనాలు కూలి, కొండచరియలు విరిగిపడటంతో ఇంత పెద్ద స్థాయిలో ప్రాణనష్టం జరిగింది.

సుమత్రా ద్వీపం చరిత్రలోనే 2004 డిసెంబర్ 26వ తేదీన అత్యంత భయంకరమైన భూకంపం వచ్చింది. దీని వల్ల హిందూ మహాసముద్రంలో సునామి సంభవించింది. దీంతో  శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్‌ దేశాల్లో 230,000 మందికి పైగా మరణించారు. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 9.1-మాగ్నిట్యూడ్ నమోదు అయ్యింది.

కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం.. కాన్వాయ్ లో వాహనం బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు

ఇదే దేశంలో ఈ నెల 10వ తేదీన కూడా ఓ భూకంపం సంభించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఆస్ట్రేలియా, తూర్పు తైమూర్‌లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఇండోనేషియాలోని తువాల్ ప్రాంతానికి 342 ఆగ్నేయ దిశలో స్థానిక కాలమానం మధ్యాహ్నం 2:47 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. అలాగే ఇండోనేషియాకు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా, తూర్పు తైమూర్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయని యూరోపియన్ సిస్మోలాజికల్ సెంటర్ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios