మీరట్ లో భూకంపం.. కంపించిన ఢిల్లీ..పరుగులు తీసిన ప్రజలు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 10, Sep 2018, 10:09 AM IST
Earthquake in Haryana, tremors felt in parts of Delhi
Highlights

ఒక్కసారిగా భూమి కంపించడంతో.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై కూడా చూపించింది. ఇవాళ ఉదయం ఆరున్నర సమయంలో మీరట్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్ఖౌదాలో భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర స్కేల్‌పై తీవ్రత 3.6 గా నమోదయినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. 

ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో గత 24 గంటల్లో రెండు సార్లు భూమి కంపించింది. నిన్న మధ్యాహ్నం హర్యానాలోని జజ్జర్ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.8 గా నమోదయింది. 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఒక్కసారిగా భూమి కంపించడంతో.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం మాత్రం జరగలేదు

loader