Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం.. చుట్టుపక్కల నగరాల్లోనూ భూప్రకంపనలు.. ట్విట్టర్ లో మీమ్స్ వైరల్

ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో స్వల్ప భూకంపం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్-తజికిస్థాన్ బోర్డర్ రీజియన్ లో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్, పూంచ్ లలో కూడా భూప్రకంపనలు సంభవించాయి.

Earthquake in Delhi-NCR region..Earthquake in surrounding cities too.. Memes viral on Twitter..ISR
Author
First Published May 28, 2023, 12:44 PM IST

ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. పంజాబ్, హరియాణాలోని పలు ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు కొనసాగిన ఈ ప్రకంపనలు ఉదయం 11.23 గంటల ప్రాంతంలో సంభవించాయని భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇండియాస్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్-తజికిస్థాన్ బోర్డర్ రీజియన్ భూకంప కేంద్రంగా గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ఫయాజాబాద్ కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.19 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్, పూంచ్ లలో కూడా భూప్రకంపనలు సంభవించాయి.

ట్విట్టర్ లో మీమ్స్ తో ముంచెత్తిన నెటిజన్లు..
ఈ ఉదయం ఢిల్లీతో పాటు పలు నగరాల్లో స్వల్ప భూ ప్రకంపనలు రావడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ షేర్ చేశారు. ‘‘నేను ఢిల్లీలో తేలికపాటి భయాన్ని అనుభవించాను’’ అని ఓ యూజర్ పేర్కొనగా.. మరొకరు ‘‘మేరొకా తొ యేసా దక్ దక్ హోరా హై’’ అని మీమ్ వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios