Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రత నమోదు
New Delhi: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రత నమోదైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1.29 గంటలకు భూకంపం వచ్చింది. భూమి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు.

Earthquake-Bay of Bengal: బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రత నమోదైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1.29 గంటలకు భూకంపం వచ్చింది. భూమి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. సోమవారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. NCS ప్రకారం, భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1.29 గంటలకు భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. ఈ భూకంప కేంద్రం 9.75 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 84.12 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.
ఎన్సీఎస్ డేటా ప్రకారం, శనివారం త్రిపురలో కూడా భూకంపం సంభవించింది. ధర్మనగర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం 43 కిలోమీటర్ల లోతులో నమోదైంది.
భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి.. ?
భూకంపం వచ్చినప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ ఇతరులకు ధైర్యం చెప్పాలి. భూ ప్రకంపనలు సంభవించే సమయంలో ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశం కోసం చూడాలి.. ముఖ్యంగా భవనాలకు దూరంగా ఉండాలి. బహిరంగ ప్రదేశంలో ఉండటం కొంతమేర సురక్షితమని విపత్తు నిర్వహణ అధికారులు సూచిస్తున్నారు. ఇంటి లోపల ఉన్నట్టయితే, డెస్క్, టేబుల్ లేదా మంచం కింద కవర్ చేసుకోవాలి. గాజు అద్దాలు, కిటికీలకు దూరంగా ఉండాలి. వీలైతే భవనాల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. బయట ఉంటే భవనాలు, యుటిలిటీ వైర్లకు దూరంగా వెళ్లాలని, వాహనాల రాకపోకలను వెంటనే నిలిపివేయాలని సూచించారు.