జమ్మూ కాశ్మీర్ మళ్లీ భూకంపం వచ్చింది. జనవరి నెలలో రెండు సార్లు ఈ ప్రాంతంలో భూమి కంపించింది. తాజాగా బందిపొర జిల్లాలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టమూ జరగలేదు. 

జమ్మూ కాశ్మీర్ లోని బందిపొర జిల్లాలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.9గా నమోదు అయ్యింది. ఉదయం 6.57 గంటలకు ఒక్క సారిగా భూమి కంపించిందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 34.42 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 74.88 డిగ్రీల తూర్పు రేఖాంశంతో భూమి క్రస్ట్ లోపల 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. ఇద్దరికి గాయాలు

జనవరి 19వ తేదీన కూడా జమ్మూ కాశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.2గా నమోదు అయ్యింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో మధ్యాహ్నం 12:04 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం భూమికి 10 కిలో మీటర్ల లోతులో ఉందని, రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రతతో నమోదైందని పేర్కొంది.

Scroll to load tweet…

అంతకు ముందు కూడా జనవరి 8వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాత్రి 11.15 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని ఎన్‌సీఎస్‌ తెలిపింది. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని పేర్కొంది. 

ప్రభుత్వ ఉగ్రవాదం.. పోలీసులను దుర్వినియోగం చేయడమే.. : ఏషియానెట్ న్యూస్ ఆఫీసు దాడుల‌పై మాజీ డీజీపీ ఆగ్రహం

గత నెల 28వ తేదీన మేఘాలయాలో కూడా భూకంపం వచ్చింది. ఉదయం 6.57 గంటలకు తురాలో 3.7 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించింది. తురాకు ఉత్తరాన 59 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని తెలిపింది. ఈ భూకంపం 29 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సమాచారం. ‘‘28.02.2023న 06.57.18 గంటలకు 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. లాట్ : 26.04, పొడవు: 90.11. లోతు: 29 కిలో మీటర్లు. ’’ అని సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. అంతకు ముందు మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల ప్రాంతంలో మణిపూర్‌లోని నోనీ జిల్లాలో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. 

తప్పుడు కేసులు: కోజికోడ్ ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై పోలీసుల దాడులు

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.