అస్సాంలో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. తేజాపూర్ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంనలు చోటు చేసుకుంది. అస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన సమాచారం ఇప్పటివరకైతే లేదు.

న్యూఢిల్లీ: అస్సాంలో భూకంపం చోటు చేసుకుంది. రెక్టర్ స్కేల్ మీద 6.4 గా ఇది నమోదైంది. ఐరోపా మెడిటేరియన్ సీస్మోలాజకిల్ సెంటర్ ఈ విషయాన్ని తెలిపింది. అస్సాంలో భారీ భూకపం వచ్చిందని, వివరాల కోసం వేచి చూస్తున్నామని అస్సాం హోం మంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. 

బుధవారం ఉదయం అస్సాంలో బారీ భూకంపం చోటు చేసుకుంది. ప్రాణ నష్టం సంభవించిన దాఖలాలు కనిపించలేదు. అస్తినష్టం జరిగినట్లు కూడా సమాచారం లేదు. ఈశాన్య భారతదేశంలోనూ, ఉత్తర బెంగాల్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

తేజాపూర్ లోనూ, దాని పరిసర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 

Scroll to load tweet…