పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.1గా నమోదు అయ్యింది. 

దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించిన కొన్ని రోజుల వ్యవధిలోనే పంజాబ్ లో భూకంపం వచ్చింది. ఆ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఆదివారం, సోమవారం మధ్య రాత్రి సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) ధృవీకరించింది.

గురుగ్రామ్ లో సంప్రదాయబద్ధంగా కుక్కలపెళ్లి.. పట్టుచీరలు, కట్నకానుకలు, హల్డీ, మెహందీ వేడుకలతో జోరుగా..

ఎన్ సీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉదయం 3:42 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని ఓ ట్వీట్ లో వెల్లడించింది. ‘‘ 14.11.2022న పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ లో 03:42:27 సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.1గా నమోదైంది. లాట్ - 31.95, పొడవు- 73.38, లోతు- 120 కిలో మీటర్లుగా ఉంది. ’’అని పేర్కొంది.

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌కు తూర్పు-ఆగ్నేయంగా దాదాపు 101 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో శనివారం రాత్రి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. ఖాట్మండుకు పశ్చిమాన 460 కి.మీ దూరంలో బజాంగ్‌కు చెందిన పటాదేబాల్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నేపాల్‌లోని నేషనల్‌ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది.

భారత్ లోని 99 శాతం ముస్లింల పూర్వీకులు హిందుస్థానీలే - ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్

నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఆరుగురు మరణించారు. రాత్రి 7:57 గంటలకు ఒక్క సారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఒక్క వారంలోనే భూమి కంపించడం ఇది మూడో సారి. నేపాల్ కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం వల్ల హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిజ్నోర్, ముజఫర్‌నగర్, షామ్లీ వంటి కొన్ని పశ్చిమ ఉత్తర ప్రదేశ్ జిల్లాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి.