Asianet News TeluguAsianet News Telugu

రెండు రోజులుగా సిక్కింలో వరుస భూకంపాలు: భయాందోళనలో జనం

సిక్కింలో శుక్రవారం నాడు భూకంపం సంబవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0 గా నమోదైంది.

Earthquake hits Sikkim two days in a row, tremors felt in Indo-Nepal border lns
Author
New Delhi, First Published Feb 5, 2021, 10:26 AM IST

గ్యాంగ్‌టక్: సిక్కింలో శుక్రవారం నాడు భూకంపం సంబవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0 గా నమోదైంది.

నేపాల్-ఇండియా సరిహద్దు సమీపంలో ఇవాళ భూకంపం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.

గురువారం నాడు కూడ సిక్కింలోని యుక్సోమ్ సమీపంలో భూకంపం సంబవించింది. ఉదయం పదిన్నర గంటల సమయంలో 124 కి.మీ లోతులో భూమి కంపించిందని అధికారులు తెలిపారు.

నేపాల్ లోని లోబుజ్యాకు వద్ద 5.2 తీవ్రతతో 110 కి.మీ. లోతులో భూకంపం సంబవించింది. ఇక్కడ భూకంపం వాటిల్లిన రెండు రోజులకు సిక్కిం రాష్ట్రంలో వరుసగా రెండు రోజుల్లో భూమి కంపించిందని యూఎస్ జియోలాజిలకల్ సర్వే తెలిపింది.

వరుసగా రెండు రోజుల పాటు సిక్కిం రాష్ట్రంలో భూకంపాలు  రావడంతో స్థానికలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ భూ కంపం వ్యాప్తి చెందుతోందోననే విషయమై ప్రజలు ఆందోళనతో ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios