ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. కొన్ని నిమిషాల కింద అక్కడ భారీ ప్రకంపనలతో భవంతులు ఊగాయి. కరోనా దెబ్బతి ఇండ్లలో ఉన్న జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. 

రోడ్లపై డ్యూటీ చేస్తున్న పోలీసు వారు, వైద్య సిబ్బంది ఇతరులంతా వణికిపోయి హాహాకారాలు పెట్టి పరుగులు తీశారు. 

3.5 తీవ్రతతో వచ్చిన భూకంపం కేంద్రం ఈశాన్య ఢిల్లీలో ఉన్నట్టుగా గుర్తించారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉండడం వల్ల ఇప్పటివరకైతే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు అని ప్రాథమికంగా తెలియవస్తుంది. ఆదివారం రోజు సాయంత్రం 5 గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ భూకంపం ఢిల్లీని కుదిపేసింది. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయని ప్రజలందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. 

బ్రేకింగ్ కథనం అవడం వల్ల మరింత సమాచారం రాగానే అప్డేట్ చేస్తాం.