ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు.. పరిగెత్తిన జనాలు

earthquake hits delhi
Highlights

ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు.. పరిగెత్తిన జనాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నాం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హర్యానాలోని సోనిపట్‌లో భూకంపం వచ్చిన కొద్దిసేపటికే ఢిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. తమ ఇళ్లలోని సామానులు అటూ ఇటూ ఊగడంతో జనాలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత కూడా వారు ఇళ్లలోకి వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. ఇంతవరకు ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎటువంటి  సమాచారం అందలేదు.

loader