ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ఓంగోలులో పలు చోట్ల శుక్రవారం నాడు ఉదయం పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు.

ఇవాళ ఉదయం 10: 15 గంటలకు భూమి కంపించినట్టుగా స్థానికులు చెప్పారు. నగరంలోని శర్మ కాలేజీ, అంబేద్కర్ భవన్, ఎన్జీవో కాలనీ, సుందరయ్య భవన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకొన్నాయి.భూ ప్రకంపనల కారణంగా ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూమి కంపించడంతో ఒంగోలు వాసులు ప్రాణాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ రాష్ట్రంతో పాటు కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడ భూమి కంపించినట్టుగా అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 6:55 గంటలకు జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది.

కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో కూడ భూ ప్రకంపనలు చోటు చేసుకొన్నాయి. భూకంప లేఖినిపై 4 గా తీవ్రత నమోదైంది.దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంప తీవ్రత కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.