జొన్న రొట్టెలతో నెలకు రూ. 25 వేలకు పైగా సంపాదన.. ఆమె కథ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి

జంక్ ఫుడ్, ఫాస్ట్ కు జనాలు బాగా అలవాటు పడ్డారు. కానీ ఇవి మన ఆరోగ్యాన్ని ఎంతో దెబ్బతీస్తాయి. ఎన్నో రోగాల బారిన పడేలా చేస్తాయి. కానీ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ మహిళ ఆరోగ్యాన్ని కాపాడే ఫుడ్ ను అందిస్తూ నెలకు అక్షరాల 25,000 రూపాయలు సంపాదిస్తోంది. 

Earning 25 thousand rupees per month with jowar rotis.. Jyoti's success story rsl

జంక్ ఫుడ్ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ జనాలు దీనికి బాగా అలవాటు పడ్డారు. ఆరోగ్యాన్ని పాడు చేసే జంక్ ఫుడ్ ను విరివిగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. సంప్రదాయ ఆహార ఉత్పత్తిలో హానికరమైన క్రిమిసంహారక మందులను ఎక్కువగా వాడటం వల్ల సమస్య ఎక్కువవుతుంది. వీధుల్లో దొరికే ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్ల యువత అనారోగ్యం బారిన పడుతున్నారు. 

ఇలాంటి సమయంలో జ్యోతి హెల్తీ ఫుడ్ తో వ్యాపారం చేస్తూ ఎంతో మంది హెల్త్ ను కాపాడుతోంది. జ్యోతి వంటల ఛాంపియన్. ఆమె వీళ్లు తినే హెల్తీ ఫుడ్ నే జనాలకు అందించడానికి నిర్ణయించుకుంది. మారుతున్న జీవనశైలి కారణంగా సాంప్రదాయ వంటలు కనుమరుగవుతున్న తరుణంలో ఆమె ఆరోగ్యకరమైన ఆహారాన్నే జనాలకు అందిస్తూ వ్యాపారం చేయాలనుకుంది. ఈ వ్యాపారం ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలకు పోషకమైన జొన్న రొట్టెలను చేయడం అస్సలు రాదు. దీనివల్ల చాలా  మంది ఇళ్లలో చపాతీలనే చేస్తుంటారు. ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి పెరుగుదల క్రమంగా మహిళల వంట నైపుణ్యాలను క్షీణింపజేసింది. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ కు భిన్నంగా.. జ్యోతి ఒక స్టార్టప్ ను స్టార్ట్ చేసింది. ప్రభుత్వ రుణ పథకం సాయంతో సొంతంగా స్టార్టప్ ను ప్రారంభించి విజయవంతమైంది. ఆమెది కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా ముమ్మిగట్టి గ్రామం.

యంత్రం ఉపయోగించి రోజుకు 400 జొన్న రొట్టెలు

జ్యోతి భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. ఆమె గృహిణిగా ఉండేది. ఆ తర్వాత ఇంట్లో సమయాన్ని వృథా చేయకుండా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఆమెకు వచ్చింది. లక్షల విలువ చేసే రోటీ తయారీ యంత్రాన్ని కొన్నది. సోలార్ ఎనర్జీతో పనిచేసే ఈ యంత్రం ప్రస్తుతం రోజుకు 400 రోటీలు తయారు చేస్తుంది. ఈ రోటీలను జ్యోతి హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లకు పంపిణీ చేస్తుంటుంది. 

నెలకు రూ.25,000 ఆదాయం

రొట్టెల తయారీ యంత్రం సాయంతో ఇంట్లో కూర్చొని ఆమె నెలకు 25 వేలకు పైగా సంపాదిస్తున్నారు. రొట్టెలతో పాటు అప్పడాలను తయారుచేసి ఆర్థిక భారాన్ని పంచుకునేందుకు భర్తతో చేతులు కలిపింది. చుట్టుపక్కల మహిళలకు స్ఫూర్తిగా నిలిచి గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు జ్యోతి. 

ప్రస్తుతం వ్యాపారాలకు  విద్యుత్ ఎక్కువ అవసరమవుతుంది. కానీ జ్యోతి సోలార్ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ఆమె సుస్థిర భవిష్యత్తు వైపు మళ్లింది. ఆమె వాళ్ల ఇంట్లోని అన్ని పరికరాలను సౌరశక్తితో నడిచేలా మార్చేసింది. తన నాయకత్వ లక్షణాలు, సుస్థిర ఆలోచనల ద్వారా ఆమె సంపాదనతో పాటు తన చుట్టూ ఉన్న మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios