Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌ముఖ హిందూ మత గురువు శంకరాచార్య స్వరూపానంద ఇక లేరు

ప్ర‌ముఖ హిందూ మత గురువు శంకరాచార్య శ్రీ‌ స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌లోని జోటేశ్వర్ ఆలయంలో ఆయన తుది శ్వాస విడిచారు.  

Dwarka Shankaracharya Swami Swaroopanand Saraswati dies at 99
Author
First Published Sep 11, 2022, 5:37 PM IST

ప్రముఖ హిందువుల మత గురువు శంకరాచార్య శ్రీ స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూశారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు జోటేశ్వర్ జిల్లా నర్సింగపూర్‌లోని పరమహంసి గంగా ఆశ్రమంలో తుదిశ్వాస విడిచారు. శంకరాచార్య 99 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయ‌న‌ గుజరాత్‌లోని ద్వారకా శారదా పీఠానికి, బద్రీనాథ్‌లోని జ్యోతిమఠాల‌కు శంకరాచార్యులుగా ఉన్నారు. ఇటీవలే హరియాలీ తీజ రోజున స్వామీజీ 99వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 

ఆయ‌న రామ మందిర నిర్మాణం కోసం శంకరాచార్య సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. అలాగే.. ఆయ‌న‌ స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా  పాల్గొన్నారు. స్వరూపానంద సరస్వతి హిందువులలో గొప్ప మత నాయకుడిగా పరిగణించబడ్డారు. చివరి క్షణంలో శంకరాచార్య అనుచరులు, శిష్యులు ఆయన దగ్గరే ఉన్నారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలియగానే.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకోవడం ప్రారంభించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios