రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులో ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా వచ్చిన పేషంట్లు ఎంతోమందిని కిరాయి ఇళ్లలో యజమానులు రానివ్వక.. ఒక్క గదే ఉన్న ఇంట్లో వ్యక్తికి కరోనా సోకితే హాస్పిటల్స్ లో చోటు దొరక్క అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇదిలా ఉంటే సెలబ్రిటీలు మాత్రం కరోనా రాకుండా ఉండాలని జనాలకు దూరంగా ఫాంహౌస్ లకు షిఫ్ట్ అవుతున్నారు. ఈ కోవలోకే వస్తారు నటి నీనా గుప్తా. నిరుడు కరోనా వార్తలు వచ్చిన వెంటనే నటి మీనా గుప్తా నైనిటాల్ కు సమీపంగా ఉండే ముక్తేశ్వర్ లోని తన విడిది గృహానికి షిఫ్ట్ అయ్యింది. అక్కడే ఉండి తగ్గాక వచ్చింది.

ఇప్పుడు మళ్లీ కరోనా ఉధృతం కాగానే ఆమె ముక్తేశ్వర్ లో ప్రత్యక్షమయ్యారు. కరోనా బాలీవుడ్ కు చుక్కలు చూపిస్తోంది.  తాజాగా విలన్ ఆశుతోష్ రానాకు కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇంకా ఎంత మందికి సోకనుందో తెలియదు. ముంబై ఏ మాత్రం సేఫ్ కాదని తెలిసిన చాలామంది ఫాం హౌస్ ల బాటపట్టారు. నటుడు సల్మాన్ ఖాన్ నిరుటి నుంచి దాదాపుగా తన పాన్వెల్ ఫాంహౌస్ లోనే ఉంటున్నారు.

కరోనా నుంచి రక్షణ పొందడానికి నటి నీనా గుప్తా కూడా నిరుడు ముక్తేశ్వర్‌ లో ఉన్న తన విడిదింటికి వెళ్లిపోయారు. అక్కడే ఏడెనిమిది నెలలు ఉన్నారు. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చినా ప్రస్తుత పరిస్థితి దృష్టా మళ్లీ ముక్తేశ్వర్‌ చేరుకున్నారు.

ముక్తేశ్వర్ నైనిటాల్ కు దగ్గర్లో ఉండే గొప్ప టూరిస్ట్ స్పాట్. ప్రశాంతంగా ఉండే పర్వత ప్రాంతం. ‘ఇక్కడి ప్రజలు, వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఉతికిన గుడ్డలను బయట ఆరవేయడం వారికి నచ్చదు. బట్టలు బాగా ఎండకు ఆరితే తప్ప నాకు అవి ఆరినట్టుగా అనిపించదు. అయినా బట్టలు ఉతికి ఆరేస్తేనే కదా అది ఇల్లు అనే భావన వస్తుంది’ అని నీనా గుప్తా ముక్తేశ్వర్ లోని తన ఇంట్లోనుంచి తీసిన వీడియోలో పేర్కొంది. 

ప్రస్తుతం నీనా గుప్తా కుమార్తె మసాబా ఫ్యాషన్ రంగంలో పనిచేస్తోంది. తల్లీ కూతుళ్లు కలిసి నటిస్తున్నారు కూడా. అయినా ఆ పనులకు బ్రేక్ ఇచ్చి సురక్షితంగా ఉండాలని నీనా భావిస్తోంది.