Asianet News TeluguAsianet News Telugu

Dry Day: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున డ్రై డే.. ఎందుకీ నిర్ణయం అంటే?

రేపు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా టీమ్‌లు ఆడనున్నాయి. ఇదే రోజున ఢిల్లీలో డ్రై డే ఉన్నది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న రోజే ఢిల్లీలో డ్రై డే ఎందుకు అమలు చేస్తున్నారు?
 

dry day in delhi on world cup final match day sunday, know why here kms
Author
First Published Nov 18, 2023, 5:31 PM IST | Last Updated Nov 18, 2023, 5:31 PM IST

న్యూఢిల్లీ: రేపు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఆదివారం నాడు టీమిండియా, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. మూడోసారి ప్రపంచ కప్ పై కన్నేసిన టీమిండియా విజయాన్ని తిలకించి ఎంజాయ్ చేయాలని క్రికెట్ అభిమానులు తెగ ఉత్కంఠతో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఓ షాక్ ఇచ్చింది. రేపు ఢిల్లీలో డ్రై డేను ప్రకటించింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజే ఢిల్లీలో డ్రై డే ఉన్నది. ఇంతకీ ఈ డ్రై డేను ఎందుకు ప్రకటించినట్టు?

దేశ రాజధానిలోని లిక్కర్ షాపులు అన్నీ ఆదివారం మూసే ఉంటాయి. ఛత్త్ పూజాను పురస్కరించుకుని ఆదివారం డ్రై డే ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ క్రిష్ణ మోహన్ ఉప్పు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిహర్ శష్టి లేదా సూర్య శష్టి సందర్భంగా ఆదివారం లిక్కర్ షాపులు మూసే ఉంచాలని ఆదేశించారు. 

ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు సూర్య భగవానుడిని పూజిస్తూ ఈ ఛత్త్ వేడుక చేసుకుంటారు. నాలుగు రోజులు జరుపుకుంటారు. రేపటితో ముగిసిపోతుంది. రేపు ఈ పూజ చేసే వారు ఉపవాసంతో ఉంటారు.

Also Read: Vijayashanthi: కేసీఆర్ స్ట్రాటజీని విజయశాంతి దెబ్బతీసినట్టేనా? ఆమెతో కాంగ్రెస్‌కు కలిసివచ్చేదేమిటీ?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తిలకించడానికి భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని మార్లెస్ కూడా హాజరుకాబోతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios