కేరళలో ఓ గ్రామస్తులు చేసిన అటవిక చర్యలకు గర్భంతో ఉన్న ఏనుగు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులను కంటతడి పెట్టించింది. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత నుంచి వరుసగా అలాంటి ఘటనలే జరుగుతున్నాయి.

తాజాగా తమిళనాడులో మరో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు టిక్‌టాక్ వీడియో కోసం జల్లికట్టు ఎద్దును దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు.

Also Read:కేరళ ఏనుగు ఘటన మరవకముందే: ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఏనుగులు మృతి.. ఒకటి 20 నెలల గర్భవతి

వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరికి చెందిన వెట్రివేల్ అనే వ్యక్తికి కాశీ ఈశ్వర అనే జల్లికట్టు ఎద్దు ఉంది. కొద్దిరోజుల క్రితం అది గాయాలపాలై మరణించింది. యజమానితో పాటు గ్రామస్తులు సైతం అది ప్రమాదవశాత్తూ మరణించి వుండొచ్చని భావించారు.

అయితే గురువారం మద్యం సేవించిన ముగ్గురు యువకులు ఎద్దు చుట్టూ చేరి రాళ్లతో కొడుతూ.. ఇసుక చల్లుతూ హింసిస్తున్న ఓ టిక్ టాక్ వీడియోను వెట్రివేల్ చూశాడు. అది తన ఎద్దేనని భావించిన అతను వెంటనే ముగ్గురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read:ఆ ఏనుగు అనుకోకుండా పైనాపిల్ తిన్నది..కేంద్ర పర్యావరణ శాఖ

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు వీడియోలో కొందరు తాగుబోతు యువకులు చెట్టుకు కట్టేసి ఉన్న ఎద్దు చుట్టూ చేరారు. దానిని రాళ్లతో కొడుతూ.. ఇసుక చల్లుతూ హింసించసాగారు.

వారి దాడిని ప్రతిఘటించి క్రమంలో ఎద్దు యువకులపై ఉరికేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో రాళ్లు దాని ముఖానికి తగలాయి. దీంతో తల భాగంలో తీవ్రంగా దెబ్బలు తగలడంతో పాటు కొమ్ములు కూడా దెబ్బతిన్నాయి.