తాగుబోతు కొడుకు పెట్టే హింసలు భరించలేక కన్నతండ్రే స్వయంగా మద్యంలో పురుగుల మందు కలిపి ఇచ్చి హత్య చేసిన ఘోరం రాయ కోట వద్ద జరిగింది. రాయ కోట సమీపంలోని మేల్నోకియూరు గ్రామానికి చెందిన రాజా (41), ఇతని కొడుకు లోకేష్ (25). లోకేష్ తాగుడుకు బానిసయ్యాడు. తాగకుండా ఉండలేడు. తాగిన తరువాత విపరీతంగా వేధింపులకు గురి చేస్తాడు.
బెంగళూరు : కర్నాటకలో దారుణ జరిగింది. కన్నకొడుకు కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకోవాల్సిన కన్నతండ్రే ఆ కొడుకు పాలిట కాలయముడిగా మారాడు. చెడు అలవాట్లకు బానిసైతే నయానో, భయానో భయం చెప్పాల్సింది పోయి.. అతి కిరాతకంగా హతమార్చాడు. తాగుడుకు బానిసై కొడుకు పెడుతున్న చిత్రహింసలు భరించలేక దారుణానికి ఒడిగట్టి నిండు జీవితాన్ని కటకటాల పాలు చేసుకున్నాడు. కర్నాటకలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెడితే...
తాగుబోతు కొడుకు పెట్టే హింసలు భరించలేక కన్నతండ్రే స్వయంగా మద్యంలో పురుగుల మందు కలిపి ఇచ్చి హత్య చేసిన ఘోరం రాయ కోట వద్ద జరిగింది. రాయ కోట సమీపంలోని మేల్నోకియూరు గ్రామానికి చెందిన రాజా (41), ఇతని కొడుకు లోకేష్ (25). లోకేష్ తాగుడుకు బానిసయ్యాడు. తాగకుండా ఉండలేడు. తాగిన తరువాత విపరీతంగా వేధింపులకు గురి చేస్తాడు.
దీంతో లోకేష్ కు పెళ్లి చేసినా భార్య ఆ వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోయింది. తరువాత రెండో పెళ్లి చేశారు. అప్పుడు కూడా ఇదే తంతు జరుగుతుండడంతో రెండో భార్య కూడా విడిచిపెట్టి వెళ్లిపోయింది. కొంతకాలానికి లోకేష్ కు మూడో పెళ్లి చేశారు. మూడో భార్య కొడియా ఇంట్లోనే ఉండేది. ఇటీవల మళ్లీ అతని గొడవలు ఎక్కువవడంతో.. భరించలేక ఆమె కూడా ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే, ఇది తట్టుకోలేని లోకేష్, పుట్టింటికి వెళ్లిన భార్యను రప్పించాలని తాగొచ్చి తండ్రిని వేధించసాగాడు. ఎంత చెప్పినా వినలేదు. దీంతో ఆవేశానికి గురి అయిన తండ్రి గత నెల 23వ తేదీన మద్యంలో పురుగుల మందు కలిపి కొడుకుతో తాగించి చంపేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని రహస్యంగా తీసుకెళ్లి దహనం చేశాడు.
లోకేష్ కనిపించడం లేదని తెలిసి రాయకోట పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం నిందితుడు రాజా సూళకుంట గ్రామాధికారి రత్నవేల్ దగ్గర లొంగిపోయాడు. గ్రామాధికారి అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని డెంకణీకోట కోర్టులో హాజరుపరిచారు. జడ్జి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను జైలుకు తరలించారు.