మద్యం మత్తులో కన్నకొడుకునే చంపుదామనుకున్న ఓ వ్యక్తి తానే బలైన సంఘటన కోల్ కతాలో జరిగింది. ఈ దారుణ ఘటనలో కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెడితే.. కోల్ కతా నివాసి షేక్ మట్లబ్ (65) తరచూ కుటుంబంతో గొడవలు పడుతుండేవాడు.
మద్యం మత్తులో కన్నకొడుకునే చంపుదామనుకున్న ఓ వ్యక్తి తానే బలైన సంఘటన కోల్ కతాలో జరిగింది. ఈ దారుణ ఘటనలో కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెడితే.. కోల్ కతా నివాసి షేక్ మట్లబ్ (65) తరచూ కుటుంబంతో గొడవలు పడుతుండేవాడు.
షేక్ మట్లబ్ కొడుకు షేక్ నాజీర్ ఇంటికి దగ్గర్లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రోజూలాగే శుక్రవారం కూడా షేక్ నాజీర్ పనినుంచి ఇంికి వచ్చేసరికి తండ్రి మద్యం మత్తులో తూగుతూ కనిపించాడు. దీంతో నజీర్ తండ్రితో గొడవ పడ్డాడు.
ఇదరికీ మాటామాటా పెరిగింది. దీంతో షేక్ మట్లబ్ కొడుకు మీదికి నాటు బాంబుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. తండ్రి చేతిలో బాంబు చూసిన నజీర్ అతడి చేయి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశాడు. ఇదర్ది మధ్య ఘర్షణలో చేతిలోనే బాండు పేలింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
బాంబు శబ్దం విన్న స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా తండ్రీ కొడుకు ఇద్దరూ తీవ్ర గాయాలతో కనిపించారు. వారిని స్థానిక ఆర్‌జీ కర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఇద్దరికీ చికిత్స అందిస్తుండగా తండ్రి షేక్ మట్లబ్ చనిపోయాడు. కొడుకు షేక్ నజీర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే షేక్ మట్లబ్‌కు ఆ బాంబు ఎక్కడినుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా? అనే దిశగా పోలీసు బృందం గాలించింది. అయితే ప్రమాదంలో చనిపోయిన షేక్ మట్లబ్‌కు నేర చరిత్ర ఉందని, కొన్నేళ్ల క్రితం చాలా కేసుల్లో అతను నిందితునిగా ఉన్నట్టు పోలీసులు అంటున్నారు.
