మందుబాబు నిర్వాకం: దొంగతనానికి వెళ్లి, అక్కడే ఫుల్లుగా మందు తాగి....
మందు దొరక్క విలవిల్లాడిపోయిన ఒక మందు బాబు మందు కోసం ఒక బార్ షాప్ కి కన్నం వేసి లోపలి దూరాడు. అక్కడిదాకా బాగానే ఉంది. వెళ్ళినాడు మందు దొంగిలించి రాక, సినిమాల్లో చూపెట్టినట్టు అక్కడే కూర్చొని మద్యం సేవించి, అది కాస్తా ఎక్కువయి అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు.
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం ప్రపంచదేశాల బాటననుసరిస్తూ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14తో మొదటి దఫా విధించిన లాక్ డౌన్ ముగియనుండగానే..... ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.... మే 3వ తేదీవరకు ఈ లాక్ డౌన్ ని పొడిగించిన విషయం తెలిసిందే!
ఇక ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ.... ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వానికి వేరే మార్గం లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో లాక్ డౌన్ ను విధించింది.
ఇక ఈ లాక్ డౌన్ వల్ల మందు దొరక్క మందుబాబులు పడుతున్న కష్టాలు ఈ కరోనా కష్టాల కన్నా ఎక్కువగా ఉన్నాయి. మందు దొరక్క, మద్యానికి బానిసలైనవారు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు.
మందుబాబుల ప్రవర్తనను చూసి భయపడి వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు కూడా తీసుకువస్తున్న సంఘటనలు మనం చాలానే చూసాము కూడా. కొందరి పరిస్థితి ఇలాగుంటే... మరికొందరేమో మందు కోసం ఏకంగా మందు షాపులకే కన్నాలేస్తున్నారు.
తాజాగా ఇలాంటిదే ఒక సంఘ్తన కర్ణాటకలో జరిగింది. మందు దొరక్క విలవిల్లాడిపోయిన ఒక మందు బాబు మందు కోసం ఒక బార్ షాప్ కి కన్నం వేసి లోపలి దూరాడు. అక్కడిదాకా బాగానే ఉంది. వెళ్ళినాడు మందు దొంగిలించి రాక, సినిమాల్లో చూపెట్టినట్టు అక్కడే కూర్చొని మద్యం సేవించి, అది కాస్తా ఎక్కువయి అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు.
తెల్లారి ఉదయం భయంకరమైన హ్యాంగ్ ఓవర్ తో ఉన్న సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే హాసన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇలా దొంగతనంగా బార్ లోకి ప్రవేశించింది 27 ఏండ్ల రోహిత్ గా తెలియవస్తుంది. ఇప్పటికే ఈ వ్యక్తి మీద పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ అయి ఉంది. ఈ వ్యక్తి ఈ లాక్ డౌన్ కి ముందు ఈ బార్ కి రెగ్యులర్ గా వస్తుండేవాడని తెలియవస్తుంది.
మద్యంపై యావ చావక, బార్ లోకి దొంగతనం కోసం దూరాడు ఈ యువకుడు. పక్కనున్న బిల్డింగ్ పైకప్పు ఎక్కి బార్ మీదకు దూకాడు. వెనకాల ఉన్న పెంకులను తొలిగించి లోపలకు దిగాడు.
అక్కడ ఫుల్ స్టాక్ ఉండడంతో అక్కడే కూర్చొని తాగాలని డిసైడ్ అయ్యాడు. అక్కడే తాగి పడిపోయాడు. అతడు వచ్చిన విషయాన్నీ తొలుత గుర్తుపట్టని సెక్యూరిటీ సిబ్బంది, తరువాత అతడి చెప్పులను చూసి గుర్తుపట్టారు. ఆ తరువాత పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్ చేసారు.