Asianet News TeluguAsianet News Telugu

ఉపాధ్యాయ వృత్తికి క‌ళంకం.. బీరు తాగుతూ పాఠాలు చెప్పిన టీచ‌ర్.. వీడియో వైర‌ల్  

యూపీలోని హత్రాస్‌లో ఓ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ ఉపాధ్యాయుడు తరగతి గదిలో మద్యం సేవించిన వీడియో వైరల్‌గా మారింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న డీఎం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారి, ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.

Drunk Teacher With Beer Cans Taking Class In Hathras School, Video Goes Viral
Author
First Published Oct 2, 2022, 11:58 PM IST

ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవమైనది, బాధ్యతాయుతమైనది. ఈ వృతిని మించిన మరో వృత్తి లేదు. భావి  తరాల‌ను మార్చే శక్తి  ఒక్క ఉపాధ్యాయవృత్తికి మాత్ర‌మే సొంతం. విద్యార్థుల‌కు విద్యా బుద్ధులు చెప్పి.. వారిని ఉన్న‌త పౌరులుగా తీర్చిదిద్దే గురుత‌ర బాధ్య‌త ఉపాధ్యాయులదే.. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్లు ఇత‌రుల‌కు మార్గ‌ద‌ర్శకంగా ఉండాలి. విద్యా బుద్ధులు, మానవ విలువలు చెప్పే వారు అంతే హుందాగా న‌డుచుకోవాలి.  కానీ, ఓ ఉపాధ్యాయుడు ఆ వృత్తికే క‌ళంకం తెచ్చాడు. ఆ పదవి గౌరవాన్ని కించపరిచాడు. క్లాస్‌లోనే బీరు తాగుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ఈ నీచ‌మైన ఘ‌ట‌న యూపీలోని హత్రాస్‌లో  జరిగింది.

ప్రభుత్వ పాఠ‌శాల‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు పుల్ గా మ‌ద్యం సేవించి.. తన వెంట క్లాస్ రూంలోకి  బీరు బాటిళ్ల‌ను తెచ్చుకున్నాడు. తరగతి గదిలో మంచి నీరులాగా బీరు తాగుతూ.. విద్యార్థులకు పాఠాలు చెప్పసాగాడు. ప‌క్క‌నే ఓ మ‌హిళా టీచ‌ర్ ఉండ‌నే ఇంగితం కూడా మరిచాడు. ఆమె ప‌క్క‌నే కుర్చీలో కూర్చుని  విద్యార్థులకు పాఠాలు చెబుతున్న‌ట్టు క‌వ‌ర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఆ వైర‌ల్ వీడియోలో.. ఒక ఉపాధ్యాయుడు తరగతి గ‌దిలో పిల్లల ముందు కూర్చీలో కూర్చోని బీరు తాగుతున్నట్లు చూడవచ్చు. పిల్లలు నేలపై కూర్చొని ఉండగా.. ఉపాధ్యాయుడు మద్యం మత్తులో తూలుతూ.. పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పుతున్న‌ట్టు క‌వ‌ర్ చేయ‌డం చూడ‌వ‌చ్చు.

అలాగే ఆ టీచర్ పాదాల దగ్గర నేలపై ఖాళీ బీరు బాటిల్ ఉండడంతో పాటు మరో బాటిల్ ను త‌న కూర్చీలో దాచుకునే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపిస్తోంది. నిందితుడైన ఉపాధ్యాయుడి వీడియో చిత్రీకరించబడినప్పుడు.. అత‌డు బీర్ బాటిల్ ను త‌న‌ వెనుక దాచడానికి ప్రయత్నించాడు, కానీ దాచడంలో విఫలమయ్యాడు. మ‌రో బాటిల్ ను  దాచిపెట్టి టీచర్ కూడా తనను తాను రక్షించుకోవడం కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లోని ఓ పాఠశాలలో ఈ వీడియో చిత్రీకరించినట్లు చెబుతున్నారు.

టీచర్ సస్పెండ్

ఈ  వీడియో వైరల్ కావడంతో..  దీన్ని సీరియస్‌గా తీసుకున్న డీఎం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారి, ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. విద్యార్థుల ముందు మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న ఆందోళన వ్యక్తుల బృందం ఈ వీడియోను చిత్రీకరించిన‌ట్టు తెలుస్తోంది.  

ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆమె కోరారు. మద్యం మత్తులో తాగుబోతు మాస్టర్ జీ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారని ట్వీట్‌లో రాశారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులే ఇలాంటి పని చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? ఈ టీచర్‌పై యూపీ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios