ఓ వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి.. హాయిగా కారులో ఏసీ ఆన్ చేసుకొని పడుకున్నాడు. కానీ తెల్లారేసరికి శవమై కనిపించాడు. ఈ దారుణ సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

నోయిడాకు చెందిన ఓ వ్యక్తి పీకలదాకా మద్యం సేవించాడు. ఆ మత్తులో కారు డ్రైవింగ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. అయితే.. ఇంటికి చేరుకునే స్థితిలో లేడు. అప్పటికే తాగిన మద్యం అతనికి తలకి ఎక్కేసింది. కారులో ఏసీ కూడా ఆన్ చేసి ఉంది. దీంతో.. మద్యం మత్తు కారణంగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే.. కారు ఏసీలో నుంచి విడుదలైన కొన్ని వాయువుల కారణంగా అతను ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

అతని మృతదేహాన్ని మరుసటి రోజు ఉదయం అతని సోదరుడు కారులో గుర్తించడం గమనార్హం. అయితే.. ఈ ఘటనపై కుటుంబసభ్యులు ఎవరూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.  అప్పటికే అతను మద్యం సేవించి ఉండటం.. కారు ఏసీలో నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదల కావడం తో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి ఉంటాడని వారు భావిస్తున్నారు. 

చనిపోయిన వ్యక్తి పేరు సుందర్ పండిట్ గా గుర్తించారు. అతని వయసు కూడా 30ఏళ్లు మాత్రమే. అయితే.. అతనికి మొదటి నుంచి మద్యం విపరీతంగా సేవించే అలవాటు ఉందని కుటుంబసభ్యులు చెప్పారు. వీకెండ్ లో బయటకు వెళ్లి.. మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. కారు పార్కింగ్ చేసిన తర్వాత అక్కడే పడుకొని నిద్రపోయాడు. ఆ తర్వాత ఈ అనుకోని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే.. కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.