Asianet News TeluguAsianet News Telugu

మందుబాబుల దుశ్చర్య.. మద్యం మత్తులో కుక్కపిల్ల తోక, చెవులు కోసి.. మందులో నంజుకుని...

ఉత్తరప్రదేశ్ లో మందుబాబులు దారుణానికి తెగించారు. మద్యం మత్తులో వీధిలో వెడుతున్న కుక్కపిల్లల చెవులు, తోక కత్తిరించి..మందులో నంజుకున్నారు. 

drunk man chop tail, ears of puppies and eat them as snack in uttar pradesh
Author
First Published Dec 15, 2022, 12:46 PM IST

ఉత్తరప్రదేశ్ : మద్యం మత్తులో మందుబాబులు అత్యంత హేయమైన పనికి దిగజారారు. ఓ కుక్కపిల్ల చెవులు కోసి.. వాటిని మందులో మంచింగ్ లాగా నంచుకుని తిన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లా, ఫరీదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఫరీదాబాద్ కు చెందిన ముఖేష్ వాల్మీకీ మందు ప్రియుడు. తన స్నేహితుడితో కలిసి మందు తాగేవాడు. ఆ రోజు కూడా అలాగే తాగారు. ఆ తరువాత రోడ్డు మీద వెడుతున్న రెండు కుక్కపిల్లలు కనిపించాయి. వాటి వెంటపడి వాటిని పట్టుకున్నారు.

ఒక కుక్కపిల్ల రెండు చెవులు కోశారు. మరో కుక్క పిల్ల తోకకు కూడా గాయం చేశారు. కాగా, కుక్కపిల్ల అరుపులు విన్న స్థానికులు గమనించగా.. రక్తం ఓడుతున్న మూగ జీవి కనిపించింది. వెంటనే వారికి విషయం అర్థమయ్యింది. దీంతో వారు మూగప్రాణుల కోసం పనిచేసే పీఎఫ్ఏ అనే స్వచ్ఛంద సంస్థకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

ముంబైలో రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలను అదుపు చేస్తున్న నాలుగు ఫైరింజన్లు

ఇక ఆ మందుబాబులు కట్ చేసిన కుక్క పిల్ల చెవులను మందులో కలుపుకుని తాగేశారు. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పీఎఫ్ఏ సంస్త రెస్క్యూ ఇన్ ఛార్జి పాఠక్ సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన కుక్క పిల్లలను రక్షించి, ఎనిమల్ కేర్ హాస్పిటల్ కు తరలించారు. తరువాత పోలీసులకు దీని మీద ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు జంతు హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి దారుణమైన ఘటన తమిళనాడులో నవంబర్ 10న చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి చేశాడు. ఆ తరువాత ఆమెను సజీవంగా పూడ్చిపెట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపంలోని చిట్టాపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సిత్తామూరుకు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్యభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. దీని కారణంగా అతని భార్య పిల్లలతో సహా పుట్టింట్లో ఉంటుంది. దీంతో అతను తల్లి యశోదతో  కలిసి ఓ ఇంట్లో ఉంటున్నాడు. శక్తివేల్ తండ్రి పదిహేనేళ్ల క్రితమే చనిపోయాడు. శక్తివేల్ కు నిత్యం మద్యం తాగే అలవాటు ఉంది. దీనివల్ల మద్యం తాగొచ్చి తరచూ తల్లితో గొడవ పడేవాడు. కొట్టేవాడు.

దీంతో భయంతో ఆమె రాత్రిపూట ఎదురింట్లో పడుకునేది. ఆ రోజు రాత్రి కూడా ఫుల్ గా మద్యం తాగొచ్చిన శక్తివేల్ తల్లితో మరోసారి గొడవపడ్డాడు. గొడవ తరువాత యశోద కనిపించకుండా పోయింది. దీంతో ఇరుగు పొరుగువారు ఆమె కోసం గాలించారు. శక్తివేల్ ఇంటికి తాళం వేసి ఉండటంతో.. అనుమానించారు. శక్తివేల్ సంగతి తెలుసుకాబట్టి.. వెతికారు. అక్కడ ఒకచోట యశోద చీర కింద పడి ఉండటాన్ని గమనించారు. 

దీంతోఅనుమానంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలే ఉన్న శక్తివేల్ వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో అతను తను చేసిన నేరం ఒప్పుకున్నాడు. తన తల్లిపై తల్లిపై దాడి చేయడంతో ఆమెతలకు గాయమయ్యిందని చెప్పాడు. స్పృహ తప్పి పడిపోయిందని, వెంటనే ఇంటి వెనుక గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్లు చెప్పాడు. పోలీసులు వచ్చి గొయ్యిని తవ్వి ఆమెను కాపాడే లోగానే ఆమె ప్రాణాలు విడిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios