ద్రౌపది ముర్ము రేపు రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం తీసుకోబోతున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రమాణం చేయనున్నారు. అనంతరం, ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రేపు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు హాజరవుతారని కేంద్ర హోం వ్యవహారాల శాఖ తెలిపింది. వీరితోపాటు మంత్రి మండలి సభ్యులు, రాష్ట్ర గవర్నర్లు, సీఎంలు, దౌత్య వేత్తలు, ఎంపీలు, ఇతర అధికారులు సెంట్రల్ హాల్‌లో కార్యక్రమానికి హాజరు అవుతారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ములు సెంట్రల్ హాల్‌కు సాదర స్వాగతంతో విచ్చేస్తారు. సీజేఐ ఎన్వీ రమణ సమక్షంలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 21 గన్ సెల్యూట్‌లతో గౌరవిస్తారు.

అనంతరం, రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె రాష్ట్రపతి భవన్‌కు చేరుతారు. ఇంటర్ సర్వీస్ గార్డుల గౌరవాన్ని స్వీకరిస్తారు. అదే విధంగా రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు పలుకుతారు. 

నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము గెలుపొందారు. రాష్ట్రపతి ఎన్నికలో పోలైన ఓట్లను గురువారం ఎన్నికల సంఘం సిబ్బంది లెక్కించారు. ద్రౌపది ముర్ము భారీ మెజార్టీతో గెలిచారు. రామ్‌నాథ్‌గా రాష్ట్రపతి పదవీ కాలం ఆదివారం తో ముగిసిపోనుంది. 

తొలి గిరిజన మహిళా నేతగా ఆమె రాష్ట్రపతి కుర్చీని అలంకరించనున్నారు. మహిళగా ఆమె రెండో రాష్ట్రపతి. తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ సేవలు అందించిన సంగతి తెలిసిందే.