పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతోనే డ్రోన్ దాడి టెక్నాలజీ ఉగ్రవాదులకు చేరిందని చినార్ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే చెప్పారు.


న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతోనే డ్రోన్ దాడి టెక్నాలజీ ఉగ్రవాదులకు చేరిందని చినార్ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే చెప్పారు.ఈ విషయమై ఓ జాతీయ ఇంగ్లీష్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. డ్రోన్ల దాడి విషయంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

also read:జమ్ము సైనిక స్థావరాల వద్ద మళ్లీ డ్రోన్లు... 4 రోజుల్లో 7 సార్లు...

జమ్మూ కాశ్మీర్ లో నాలుగేళ్లుగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ల దాడిపై పాకిస్తాన్ హస్తం ఉందని పోలీసులు కూడ అనుమానిస్తున్నారు.ఇటీవల బనిహాల్ అనే లష్కరే ఆపరేటర్ ను అరెస్ట్ చేయడంతో ఇది మరింత బలపడింది. జమ్మూ ఎయిర్ పోర్టుపై దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అతడిని అరెస్ట్ చేశారు. 

నాలుగైదు రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి.జమ్మూకాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో వరుసగా డ్రోన్లు కన్పిస్తున్నాయి. డ్రోన్లను నిర్వీర్యం చేసే వ్యవస్థపై ఇండియా కేంద్రీకరించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాశ్మీర్ లో పర్యటించారు. ఆర్మీ అధికారులతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ రక్షణ శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.