New Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై డ్రోన్ ఎగురవేయడం కలకలం రేపుతోంది. దేశరాజధానిలోని నో ఫ్లైయింగ్ జోన్ లో ఉన్న ఆయన గృహంపై డ్రోన్ ఎగురడం భారీ భద్రతా ఉల్లంఘనగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది.
Delhi Chief Minister Arvin Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై డ్రోన్ ఎగురవేయడం కలకలం రేపుతోంది. దేశరాజధానిలోని నో ఫ్లైయింగ్ జోన్ లో ఉన్న ఆయన గృహంపై డ్రోన్ ఎగురడం భారీ భద్రతా ఉల్లంఘనగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై మంగళవారం డ్రోన్ కనిపించింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని ముఖ్యమంత్రి నివాసంపై డ్రోన్ కనిపించినట్లు సమాచారం అందిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
