Akshardham Temple: ఢిల్లీలోని అక్షరధామ్ టెంపుల్ సమీపంలో సోమవారం డ్రోన్ ఎగురడం కలకలం రేగింది. దీంతో స్పెషల్ సెల్, ఐబీ సహా అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన వారు అక్కడికి చేరుకున్నారు. అక్షరధామ్ ఆలయం సమీపంలో డ్రోన్ ఎగురవేస్తున్న బంగ్లాదేశ్ మహిళను అదుపులోకి తీసుకున్నారు
Akshardham Temple: తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ టెంపుల్ సమీపంలో సోమవారం డ్రోన్ ఎగురుతున్న వార్త తెలియడంతో కలకలం రేగింది. ఆలయ ప్రాంగణం సమీపంలో డ్రోన్‌ను చూసిన భద్రతా సిబ్బంది విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణలో బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ రిమోట్ కంట్రోల్‌తో డ్రోన్‌ను ఎగురవేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే డ్రోన్, రిమోట్ స్వాధీనం చేసుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఇంతలో సమాచారం అందుకున్న స్పెషల్ సెల్, IB సహా అన్ని గూఢచార సంస్థలు కూడా ఘటన స్థలానికి చేరుకున్నాయి. సదరు మహిళను మండవలి పోలీస్‌స్టేషన్‌కు తరలించి, క్షుణ్ణంగా విచారిస్తున్నారు. మొదట్లో ఆ మహిళ తనను తాను ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్ (ఫోటోగ్రాఫర్)గా చెప్పుకున్నట్టు తెలుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బంగ్లాదేశ్‌లోని ఢాకా నివాసి మోమో ముస్తఫా (33 సంవత్సరాలు)గా గుర్తించారు. మోమో ముస్తఫా BBA పాస్ చదువుతూ.. బంగ్లాదేశ్‌లో ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. ఆమె మే 2023లో ఆరు నెలల పాటు టూరిస్ట్ వీసా భారత్ కు వచ్చింది. ఈ క్రమంలో అనుమతి లేకుండా ఆలయ సమీపంలో డ్రోన్ నడుపుతుండగా మహిళ పట్టుబడింది. మండవాలి పోలీస్ స్టేషన్ ఐపిసి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తోంది.
అక్షరధామ్ దేవాలయం సమీపంలో డ్రోన్‌ను ఎగరవేయడానికి మహిళ ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయమై పోలీసులు బంగ్లాదేశ్ ఎంబసీకి కూడా సాయంత్రం సమాచారం అందించారు. మహిళ మొబైల్ ఫోన్, ఇతర డాక్యుమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం ఎప్పుడూ ఉగ్రవాదుల టార్గెట్‌లోనే ఉంటుంది. ఈ ఆలయంపై దాడి చేస్తామని ఉగ్రవాదులు బెదిరింపులు చేస్తుంటారు.అటువంటి పరిస్థితిలో అక్షరధామ్ ఆలయం దగ్గర ఎల్లప్పుడూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తారు. డ్రోన్లు లేదా అలాంటి కార్యకలాపాలపై పూర్తిగా నిషేధం విధించారు. ఈ క్రమంలో సోమవారం నాడు ఆలయం లోపల డ్రోన్లు ఎగురుతూ ఉండటం చూసి ప్రజలు షాక్ అయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే తూర్పు జిల్లా పోలీస్ డిప్యూటీ కమిషనర్ అమృత గుగులోత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మహిళ విచారణ కొనసాగుతోంది. అక్షరధామ్ ఆలయం ఢిల్లీ మాత్రమే కాదు. దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి. నిత్యం వేలాది మంది ప్రజలు ఈ ఆలయదర్శనానికి వస్తుంటారు.
