ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రళ రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 

వేగంగా వస్తున్న ఓ ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ చెట్టును ఢీకొనడంతో ఒకరు మరణించగా, మరో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడిన దుర్ఘటన కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగర సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. తిరువనంతపురం నుంచి కోజికోడ్ నగరానికి వస్తున్న కర్ణాటక స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ సూపర్ డీలక్సు బస్సు కొచ్చి నగర సమీపంలోని చక్కర పరంబు వద్ద ప్రమాదవశాత్తూ చెట్టును ఢీకొంది.

ఈ దుర్ఘటన సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగింది. నాలుగు లేన్ల రహదారిపై వస్తున్న బస్సు చెట్టును ఢీకొనడం వల్ల బస్సుడ్రైవరు అరుణ్ సుకుమారన్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో బస్సు దెబ్బతింది. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో వారిని రెండు ఆసుపత్రులకు తరలించి చికిత్స చేపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.