Asianet News TeluguAsianet News Telugu

రియల్ లైఫ్‌లో ‘దృశ్యం’ సీన్​ ​.. బీజేపీ కార్యకర్త హత్య, ఆపై ఇంటి అడుగున పూడ్చి ప్లాస్టింగ్

హత్యలకు , నేరాలకు నేరస్తులు సినిమాలు చూసి స్పూర్తి పొందుతున్నారు. తాజాగా కేరళలో దృశ్యం సినిమాలో మాదిరిగా చేశాడో హంతకుడు. బిందు కుమార్ అనే బీజేపీ కార్యకర్త డెడ్ బాడీని గోడ కింద పెట్టి ప్లాస్టింగ్ చేశాడు
 

Drishyam model murder in Kerala
Author
First Published Oct 1, 2022, 8:22 PM IST

వెంకటేశ్ , మీనా జంటగా నటించిన దృశ్యం సినిమా గుర్తుందిగా.... అందులో ఓ హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో సీఐ ఛైర్ కిందనే పాతిపెట్టి ఫ్లోరింగ్ చేస్తారు. సరిగ్గా ఇలాంటి తరహాలోనే జరిగిన ఓ రియల్ క్రైమ్ కేరళలో సంచలనం రేపుతోంది. దృశ్యం సినిమా సీన్‌ను తలపించేలా ఓ హత్య జరిగింది. బిందు కుమార్ అనే బీజేపీ కార్యకర్త డెడ్ బాడీని గోడ కింద పెట్టి ప్లాస్టింగ్ చేశాడు నిందితుడు. నాలుగు రోజల కింద మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న కొట్టాయం పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. అప్పుడు బిందు కుమార్ మొబైల్ సిగ్నల్ చివరి సారి ముత్తు కుమార్ ఇంటి సమీపంలో కనిపించింది. ఆ సమీపంలోనే బిందు కుమార్ బైక్‌ను గుర్తించారు పోలీసులు. అంతేకాకుండా ఇంటి ఆవరణలో కొత్త నిర్మించిన గోడ ఈ అనుమానాన్ని బలపరిచింది. చివరికి ఆరుగంటల పాటు శ్రమించిన పోలీసులు గోడ కింద బిందు కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ హత్య ప్రస్తుతం కేరళలలో సంచలనం సృష్టిస్తోంది. 

ఇకపోతే... దృశ్యం సినిమా పదిసార్లు చూసి ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేయించింది ఓ యువతి. ఆమె స్నేహ కాంబళె… ఆ యువతిని కర్ణాటక రాష్ట్రం బెలగావి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హత్యను ప్రోత్సహించిన ఆమె తల్లి, మృతుడి భార్య రోహిణి కాంబళె, స్నేహ ప్రియుడు అక్షయ్ విఠకర్ లను అరెస్టు చేశామని  జిల్లా ఎస్పీ సంజీవ్ పాటిల్ తెలిపారు.

హత్య తామే చేశామని పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ‘దృశ్యం’ సినిమాను వారు ముగ్గురూ పదిసార్లు చూసినట్లు విచారణ సందర్భంగా ఒప్పుకున్నారని ఎస్పీ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రముఖ భూవ్యాపారి సుధీర్ కాంబళె ( 57) ఇటీవల హత్యకు గురయ్యాడు. గతంలో ఆయన దుబాయ్ లో పనిచేసేవారు. కరోనా మహమ్మారి సమయంలో బెలగావిలోని క్యాంపు ఏరియాలో ఉంటూ భూవ్యాపారాన్ని తిరిగి ప్రారంభించారు.

ALso Read:దృశ్యం సినిమా పదిసార్లు చూసి.. తల్లితో కలిసి తండ్రిని దారుణంగా హత్య చేసిన కూతురు.. ఎందుకంటే..

సుధీర్, రోహిణిలకు స్నేహ ఒక్కతే కుమార్తె. మహారాష్ట్రలోని పూణేలో ఒక కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు ఆమెకు అక్షయ్ పరిచయమయ్యాడు. వారి ప్రేమ విషయాన్ని ఇటీవల గుర్తించిన సుధీర్ కుమార్తెను మందలించాడు. దీంతో తండ్రి అడ్డు తప్పించాలని ఆమె భావించింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పగా..  హత్యకు ఆమె కూడా ప్రోత్సాహం అందించింది. దని ప్రకారం తన ప్రియుడిని పూణే నుంచి బెలగావికి సెప్టెంబర్ 15న పిలిపించిన స్నేహ.. పథకం ప్రకారం ఓ లాడ్జిలో ఉంచింది. తండ్రి ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్నప్పుడు 17వ తేదీన ఉదయం అక్షయ్ ను తల్లీబిడ్డలు ఇంటికి పిలిపించారు.

సుధీర్ కాళ్ళు చేతులను వారిద్దరూ పట్టుకోగా..  ఆయన కడుపు, గొంతు, చేతులు, ముఖంపై కత్తితో అక్షయ్ ఇష్టానుసారంగా పొడిచాడు. సుధీర్ మరణించాడని ధ్రువీకరించుకున్నాక అక్షయ్ పూణేకు వెళ్ళిపోయాడు. తన భర్తను ఎవరో హత్య చేసి పరారయ్యారని రోహిణి ఇచ్చిన ఫిర్యాదుతో డిసిపి రవీంద్ర దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎలా అడిగినా వారిద్దరూ ఒకే రకమైన సమాధానాలు ఇచ్చారు.  అనుమానంతో  తల్లి కుమార్తెల ఫోన్ కాల్స్ ను పోలీసులు పరిశీలించారు. స్నేహ క్రమం తప్పకుండా అక్షయ్ తో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios