Asianet News TeluguAsianet News Telugu

బంగారం స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు.. రూ.21 కోట్ల విలువైన 36 కేజీల బంగారం స్వాధీనం..

కొంతమంది విదేశీ పౌరులు, అనుమానిత భారతీయుల ప్రయాణ విధానాలను పర్యవేక్షించడం ద్వారా DRI ఈ రాకెట్‌ను ఛేదించింది. ఈ బంగారాన్ని కొంత మంది విదేశీయులతో పాటు వివిధ వ్యక్తుల నుంచి అందుకున్నట్లు అరెస్టయిన నిందితుడు విచారణలో చెప్పాడు. ట్రావెల్ బ్యాగుల్లో, బట్టల మడతల్లో, యంత్రాల్లో దాచి క్యాప్సూల్ రూపంలో శరీరంలోకి స్మగ్లింగ్ చేశారు.

DRI seizes smuggled gold worth Rs 21 crore, unaccounted cash at Mumbai air cargo complex
Author
First Published Jan 25, 2023, 12:15 AM IST

ముంబై అంధేరీలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను గుట్టు రట్టు చేసింది. దాదాపు రూ.21 కోట్ల విలువైన 36 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో 20 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకుంది. డీఆర్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారాన్ని కరిగించే షాపు ఇన్‌చార్జిని కూడా అరెస్టు చేశారు. వివిధ హవాలా ఆపరేటర్ల ద్వారా ఈ బంగారాన్ని విదేశాల నుంచి ముంబైకి తీసుకొచ్చినట్టు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు DRI ఎయిర్ కార్గో ప్రాంగణంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో బంగారం స్మగ్లింగ్, పంపిణీ ప్రక్రియలో ప్రమేయం ఉన్న రాకెట్ ను DRI గుర్తించింది.ఇది హవాలా ద్వారా చెల్లించబడింది.

ట్రావెలింట్ హిస్టరీని పర్యవేక్షించడంతో ..

కొంతమంది విదేశీ పౌరులు, అనుమానిత భారతీయుల ట్రావెలింగ్ హిస్టరీని పర్యవేక్షించడంతో DRI ఈ రాకెట్‌ను ఛేదించింది. ఈ బంగారంతో ప్రమేయం ఉన్న కొంత మంది విదేశీయులతో పాటు వివిధ వ్యక్తుల నుంచి అందుకున్నట్లు తెలుస్తుంది.  ట్రావెల్ బ్యాగుల్లో, బట్టల మడతల్లో, యంత్రాల్లో, క్యాప్సూల్ రూపంలో స్మగ్లింగ్ చేసినట్టు గుర్తించారు.  

90 వేల డాలర్లు, 2.5 కిలోల బంగారం పేస్టు.. ఇద్దరు విదేశీ పౌరులు అరెస్ట్..

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో ఇద్దరు విదేశీ పౌరులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక విదేశీయుడి నుంచి 90 వేల డాలర్లు, మరో విదేశీ ప్రయాణీకుడి నుంచి 2.5 కిలోల బంగారు ముద్ద స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ అమెరికన్ డాలర్లను పుస్తకాల్లో దాచి తీసుకెళ్లారు. అజర్‌బైజాన్ నుండి షార్జాకు ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని ఆదివారం విమానాశ్రయంలో కస్టమ్స్ అడ్డగించగా, అతని నుండి రూ. 73 లక్షల విలువైన USD 90,000 స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. మరో చర్యలో, దుబాయ్‌కి చెందిన ఒక విదేశీ పౌరుడు రూ. 1.30 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారం పేస్ట్‌తో పట్టుబడ్డాడు.

Follow Us:
Download App:
  • android
  • ios