Asianet News TeluguAsianet News Telugu

ముంబయి ఎయిర్‌పోర్టులో 16 కిలోల బంగారం పట్టివేత.. 19 మంది అరెస్టు

ముంబయి ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని పట్టుకున్నారు. 18 మంది సూడాన్ మహిళలు, మరొక ఇండియన్ మూడు విమానాల్లో యూఏఈ నుంచి ఇండియాకు అక్రమ మార్గంలో బంగారాన్ని తీసుకువచ్చారు. రూ. 10.16 కోట్ల విలువైన 16.36 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు.
 

DRI officials seized 16.36 kg of smuggled gold at mumbai airport kms
Author
First Published Apr 26, 2023, 6:15 AM IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. పేస్ట్, చిన్న చిన్న ముక్కలు, ఆభరణాల రూపంలో 16.36 కిలోల బంగారాన్ని వారు దేశంలోకి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. యూఏఈ నుంచి వారు ముంబయి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ బంగారం విలువ సుమారు రూ. 10.16 కోట్లు అని అధికారులు అంచనా వేశారు.

యూఏఈ నుంచి సిండికేట్ అయిన కొందరు భారీ మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. మొత్తం మూడు విమానాల్లో వారు ప్రయాణిస్తున్నారని తెలుసుకున్నారు. దీంతో డీఆర్ఐ అధికారులు విమానాల నుంచి బయటకు వస్తున్నవారిపై నిఘా వేశారు. అనుమానిత ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. సెర్చ్ చేసి రూ. 10.16 కోట్ల విలువైన 16.36 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు.

ఈ కేసులో మొత్తం 19 మందిని అదుపులోకి తీసుకు న్నారు. 18 మంది సూడాన్ మహిళలు ఉన్నారు. ఒక ఇండియన్ ఉన్నారు. ఇండియన్ వారందరినీ కోఆర్డినేట్ చేశారని అధికారులు తెలిపారు.

Also Read: నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు.. 13 మంది అరెస్ట్

అధికమొత్తంలో బంగారం వారి బాడీలో దొరికింది. ఆ బంగారాన్ని గుర్తించడం కష్టంగా మారింది. వారికి సంబంధించిన ప్రాంతాల్లో సెర్చ్ చేయగా రూ. 85 లక్షల 1.42 కిలోల బంగారం, 16 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 88 లక్షల భారత కరెన్సీని రికవరీ చేసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios