బెంగుళూరు:కర్ణాటక రాష్ట్రంలోని జోడి చిత్రదుర్గలో మంగళవారం నాడు  డిఆర్‌డిఓ ఏరియల్  వాహనం రుస్తుం -2 కూలిపోయింది.

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. మంగళవారం నాడు  ఉదయం పొలాల్లో రైతులు పనిచేసుకొంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. వ్యవసాయ భూముల్లో పనిచేస్తున్న రైతులు ఈ ప్రాంతానికి చేరుకొన్నారు.

డిఆర్‌డిఓ మొట్టమొదటిసారిగా దేశ రాజధానిలోని డిఫెక్స్ప్ -2014 లో రుస్తోమ్ 2 ను ప్రదర్శించింది .ఆ తర్వాత 2018 ఫిబ్రవరిలో మొదటిసారి చిత్రదుర్గలోని చలకెరె వద్ద ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఎటిఆర్) వద్ద విజయవంతంగా ప్రయాణించింది.

రుస్తోమ్ 2 మీడియం-ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్  మానవరహిత వైమానిక వాహనం.  ప్రస్తుతం సేవలో ఉన్న హెరాన్ యుఎవిలను భారత సాయుధ దళాలతో భర్తీ చేయనుంది.

యూఏవిని  ఏడీఈ డెవలప్ చేసింది. భారత నేవీ, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అవసరాలను బెంగుళూరు ఏరోస్పేస్ మేజర్ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ , బారత్ ఎలక్ట్రానిక్స్  నెరవేర్చింది.