Asianet News TeluguAsianet News Telugu

2-డీజీ డ్రగ్‌: భారీగా డోసుల తయారీ, పంపిణీ కోసం... డీఆర్‌డీవో కీలక నిర్ణయం

కరోనా చికిత్సలో భాగంగా డా.రెడ్డీస్‌తో కలిసి డీఆర్‌డీవో 2-డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దీని ఉత్పత్తికి సంబంధించి డీఆర్‌డీవో కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ఔషధాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి  చేసేలా తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఇతర ఔషధ తయారీ సంస్థలకు బదిలీ చేస్తామని ప్రకటించింది

DRDO invites EoI to transfer technology of 2 DG drug for bulk production ksp
Author
New Delhi, First Published Jun 9, 2021, 6:17 PM IST

కరోనా చికిత్సలో భాగంగా డా.రెడ్డీస్‌తో కలిసి డీఆర్‌డీవో 2-డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దీని ఉత్పత్తికి సంబంధించి డీఆర్‌డీవో కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ఔషధాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి  చేసేలా తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఇతర ఔషధ తయారీ సంస్థలకు బదిలీ చేస్తామని ప్రకటించింది. ఇందుకు కంపెనీల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ (ఈఓఐ)ను ఆహ్వానించింది. ఈమెయిల్‌ ద్వారా తమ దరఖాస్తులను పంపాలని కోరింది. ఆయా కంపెనీలు దరఖాస్తులను సమర్పించడానికి జూన్ 17 చివరి తేదీగా వెల్లడించింది.

పరిశ్రమలు సమర్పించిన ఈఓఐను తమ టెక్నికల్ అసెస్‌మెంట్ కమిటీ పరిశీలిస్తుందని వీటి ఆధారంగా 15 పరిశ్రమలకు మాత్రమే ఉత్పత్తికి అనుమతి ఉంటుందని డీఆర్‌డీవో వెల్లడించింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, సామర్ధ్యం, తమ సాంకేతిక హ్యాండ్‌హోల్డింగ్ సామర్ధ్యం ఆధారంగా కేటాయింపు ఉంటుందని డీఆర్‌డీవో తెలిపింది.  మరోవైపు ఈ మందు తయారీకి బిడ్డర్లకు డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీల నుండి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్ (ఏపీఐ), డబ్ల్యూహెచ్‌ఓ జీఎమ్‌పి (మంచి తయారీ పద్ధతులు) ధృవీకరణ తయారీకి డ్రగ్ లైసెన్స్ ఉండాలి.

Also Read:కరోనా రోగులకు ఊరట: పౌడర్ రూపంలో ఔషధం, డీఆర్‌డీవో డ్రగ్‌కు గ్రీన్‌సిగ్నల్

క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల ఆధారంగా కరోనా నివారణలో తమ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2 డీజీ) ఆసుపత్రులో చేరిన రోగులు వేగంగా కోలుకుంటున్నట్లు డీఆర్‌డీవో తెలిపింది. అలాగే ఆక్సిజన్‌పై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందని ప్రకటించింది.

కాగా వినూత్నమైన పనితీరు కారణంగానే కరోనా వైరస్‌ను 2 డీజీ సమర్థవంతంగా నిరోధించ గలుగుతోందని డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జీ సతీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ మందు తయారీ, పంపిణీ సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కరోనా మ్యూటేషన్‌లపై కూడా 2 డీజీ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుందని డీఆర్‌డీవోకు అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios