Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ పై దాడిచేస్తే.. పదేళ్ల జైలు శిక్ష

వైద్యులు, వైద్యసేవా నిపుణులను తీవ్రంగా గాయపరిచిన వారికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు జరిమానా విధించాలని వారు భావిస్తున్నారు.

Draft Bill Proposing Jail For Hurting Doctors On Duty Ready: Minister
Author
Hyderabad, First Published Aug 14, 2019, 11:04 AM IST

విధుల్లో ఉన్న డాక్టర్లు, ఆరోగ్య నిపుణులపై దాడి చేస్తే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలు కల్పించే ముసాయిదా బిల్లును రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. వైద్యులు, వైద్యసేవా నిపుణులను తీవ్రంగా గాయపరిచిన వారికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు జరిమానా, అదేవిధంగా ఆస్పత్రిపై దాడి చేసి నష్టం కలిగించిన వారికి ఆరు నెలల నుంచి 5ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనలను పొందుపరిచామన్నారు.

త్వరలోనే దీనిపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు వారు చెప్పారు. దీని తర్వాత బిల్లును కేంద్ర మంత్రి వర్గం ముందు వెళుతుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో వైద్యులపై దాడికి నిరసనగా జూన్ లో దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios