Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్, వ్యాక్సినేషన్లే భారత్ ను కాపాడతాయి - అమెరికా ఆరోగ్య నిపుణుడు

భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిని 'చాలా తీవ్రమైందని', దేశం 'అత్యవసరం' లో ఉందని అమెరికా టాప్ పబ్లిక్ హెల్త్ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి వెంటనే తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించాలని, జలకు మెరుగైన వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని అన్నారు. సాయుధ దళాలతో సహా ప్రభుత్వ వనరులను కేటాయించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

Dr Anthony Fauci advises India to go for massive COVID vaccination drive, month-long lockdown - bsb
Author
hyderabad, First Published May 7, 2021, 11:59 AM IST

భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిని 'చాలా తీవ్రమైందని', దేశం 'అత్యవసరం' లో ఉందని అమెరికా టాప్ పబ్లిక్ హెల్త్ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి వెంటనే తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించాలని, జలకు మెరుగైన వైద్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని అన్నారు. సాయుధ దళాలతో సహా ప్రభుత్వ వనరులను కేటాయించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

SARS-CoV-2 పై పనిచేస్తున్న అధికారులలో డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఒకరు. ఇటీవల సిఎన్ఎన్ న్యూస్ -18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, డాక్టర్ ఫౌసీ మాట్లాడుతూ.. భారత్ లో కోవిడ్ -19 వ్యాప్తిని అడ్డుకోవాలనంటే.. వైరస్ గొలుసును విచ్ఛిన్నం చేయాలంటే దేశవ్యాప్తంగా 3-4 వారాల లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఉందన్నారు.

‘భారత్ లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న అనేక ప్రాంతాలు ముందుగా లాక్ డౌన్ చేయాలి. అలాగని లాక్ డౌన్ మరీ ఆర్నెళ్ల పాటు అన్నీ మూసిపెట్టమని కాదు.. వైరస్ చెయిన్ ను తెగ్గొట్టే వరకు అంటే కనీసం 3,4 వారాలు లాక్డౌన్ చేయాలి. అప్పుడు కేసులు తగ్గుముఖం పడతాయి. వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. అప్పుడు వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలి. అప్పుడే ఈ భయంకర పరిస్థితి నుంచి బయటపడతాం. ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువమందికి వ్యాక్సిన్ చేయగలిగితే అంత మంచిది ’ అని డా. ఫౌసీ అన్నారు. 


"దేశంలోని చాలా ప్రాంతాలను, ముఖ్యంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మూసివేయాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానన్నారు.  దశను తీసుకోవలసి ఉందని నేను భావిస్తున్నాను మరియు ఆరు నెలలు మూసివేయడం నా ఉద్దేశ్యం కాదు, మీరు దీన్ని చేయనవసరం లేదు. మీరు ప్రసార గొలుసును విచ్ఛిన్నం చేయాలి మరియు రెండు, మూడు వారాలు, నాలుగు వారాలు సాధ్యమైనంతవరకు మూసివేయడం ద్వారా ఒకరు దీన్ని చేయవచ్చు, ఆపై కేసులు రావడం ప్రారంభించిన వెంటనే మరియు మీరు ఎక్కువ మందికి టీకాలు వేస్తే, అప్పుడు మీరు చేయవచ్చు వ్యాప్తి యొక్క పథం కంటే ముందుగానే ఉండండి, ఎందుకంటే స్పష్టంగా, మీకు వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయవలసి వచ్చింది, ”అని డాక్టర్ ఫౌసీ చెప్పారు.

అంతేకాదు ఇండియా కరోనా మీద పోరాడే అనేక చిన్న దేశాలకు తన సహాయ హస్తాన్ని అందించిందని గుర్తు చేశారు ఫౌసీ. అందుకే భారత్ కి సహాయం చేయడానికి అందరం ముందున్నాం అని అన్నారు. 

ఈ పరిస్థితికి ముందు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తి చేసే దేశం.  కాబట్టి మీరు మీ వనరులను ఉపయోగించుకోండి, టీకాలు మీరే సిద్ధం చేసుకోండి. టీకాల సరఫరా కొరత ఉందని నాకు తెలుసు, కానీ మీ స్వంత సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి వీలైనంత ఎక్కువగా ప్రయత్నించండి, ఆ తరువాతే ఇతర దేశాల మీద ఆధారపడండి”అన్నారాయన.

దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెడితే ఏర్పడే ఆర్థిక అసమతుల్యత గురించి కూడా డాక్టర్ ఫౌసీ ప్రసంగించారు. "కొన్ని వారాల పాటు లాక్ డౌన్ పెడితే.. ఆర్థిక వ్యవస్థ ఎటువంటి సందేహం లేకుండా కోలుకుంటుంది. ఉదాహరణకు అమెరికా ఆర్థిక వ్యవస్థను చూడండి. లాక్ డౌన్ తరువాత చాలా చక్కగా కోలుకుంటుంది. కాబట్టి 3,4 వారాల పాటు లాక్ డౌన్ పెట్టడం వల్ల నష్టం ఉండదు. సుదీర్ఘ కాలంతోనే సమస్య”అని ఆయన అన్నారు.

ఇప్పుడున్న COVID-19 వేరియంట్ మరింత ప్రాణాంతకమని డా. ఫౌసీ పేర్కొన్నాడు, “ప్రజలకు ఎక్కువ  ఆక్సిజన్ అవసరం పడడం అనేది బాగా ఆలోచించాల్సిన విషయం. అంతేకాదు ఇది మామూలు వైరస్ కంటే ప్రమాదకరమని, భవిష్యత్తులో మరిన్ని అనారోగ్యాలకు కారణమవుతుందని గుర్తించాలని అన్నారు.  అంతేకాదు యువత కూడా ఎక్కువగా దీని బారిన పడడం, ఆక్సీజన్ అవసరం ఈ రెండూ ఈ వైరస్ తీవ్రతను అర్థం చేసుకోవడానికి పనికొస్తాయని అన్నారు. 

కరోనా మీద భారత్ చేస్తున్న పోరాటం మీద డాక్టర్ ఫౌసీ ఇలా మాట్లాడుతూ “మీరు మంచి వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు, ఎలాగైతే మా టీకాలలాంటివి అప్పుడు వైరస్ ను తటస్థీకరించే యాండీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగని వందశాతం ఎదుర్కోలేదు. కానీ తీవ్రతను నుండి బయటపడడానికి దోహదపడుతుంది. దేశంలోని ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకుంటే కొత్తగా వచ్చే వేరియంట్స్ ను తట్టుకునే శక్తి పెరుగుతుంది’ అన్నారు.

ఇతర దేశాల నిపుణులు చేసిన తప్పుల నుండి భారత ఆరోగ్య నిపుణులు సంబంధిత అధికారులు పాఠాలు నేర్చుకోవాలని కోరారు. "ఇతర దేశాలు ఎదుర్కొన్న ఇబ్బందుల నుండి మీరు నేర్చుకోగలరని నా అభిప్రాయం. అమెరికాలో మేము చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కున్నాం. అయినా ఇంకా పూర్తిగా బయటపడలేదు, అందుకే మీరిప్పుడు దేశమంతా ఐక్యంగా కలిసి దీని మీద పోరాటం చేయాలి’ ఆయన అన్నారు.

“అంతర్గత విభేదాలు వద్దు, మీ అందరి సాధారణ శత్రువు వైరస్. కాబట్టి మీరు అన్ని రాజకీయ విభేదాలను, అన్ని సైద్ధాంతిక వ్యత్యాసాలను పక్కన పెట్టి, ఒకటే ఫోకస్ గా వైరస్ నియంత్రణ మీద దృష్టి పెట్టాలి. శత్రువు వైరస్. మీరు కలిసి వైరస్తో పోరాడవలసి వచ్చింది, ప్రత్యేకించి మీకు యునైటెడ్ స్టేట్స్ వంటి పెద్ద, విభిన్న దేశం, భారతదేశం వంటి పెద్ద వైవిధ్యమైన దేశం ఉన్నప్పుడు, మీరు మీ వనరులన్నింటినీ ఉపయోగించుకోవాలి. వైరస్ పై దృష్టి పెట్టాలి, అది నేను నేర్చుకున్న పాఠం, ”అని డాక్టర్ ఫౌసీ ముగించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios