Asianet News TeluguAsianet News Telugu

రేపిస్టుల విడుదలపై న్యాయవ్యవస్థను తప్పుపట్టడం సరికాదు.. ఆ జడ్జీ ఏమన్నాడంటే?

బిల్కిస్ బానో కేసు నుంచి దోషులను విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కొందరు ప్రభుత్వాన్ని, మరికొందరు న్యాయవ్యవస్థను విమర్శించారు. దోషుల విడుదల ప్రభుత్వం నిర్ణయం అని, అందుకు న్యాయమూర్లును నిందించడం సరికాదని ఓ న్యాయమూర్తి తెలిపారు.
 

dont blame judicidary for remission of rapists in bilkis bano case
Author
First Published Aug 19, 2022, 4:25 PM IST

ముంబయి: దేశవ్యాప్తంగా బిల్కిస్ బానో కేసు మరోసారి చర్చకు వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారిని జైలు నుంచి విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. రాజకీయ నాయకులు మొదలు సామాన్య ప్రజల వరకు ఈ అంశం ఆధారం చేసుకుని తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. కొందరు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే.. మరికొందరు న్యాయవ్యవస్థపై నిందలు మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ మృధుల భాత్కర్ స్పందించారు. బిల్కిస్ బానో కేసు నుంచి 11 మంది దోషులను విడుదల చేసిన విషయమై మాట్లాడారు. ఇది ప్రభుత్వం నిర్ణయం అని, దీనితో న్యాయవ్యవస్థకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

బిల్కిస్ బానో కేసు వివిధ దశలతో సంబంధం ఉన్న జ్యుడిషియల్ అధికారులు ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు. ఆ దోషులను విడుదల చేయాలనే నిర్ణయం ప్రభుత్వానిదేనని, దానికి న్యాయవ్యవస్థను నిందించడం సరికాదని స్పష్టంం చేశారు.

ప్రస్తుత పరిణామాల పట్లా జస్టిస్ మృదుల భాత్కర్ కామెంట్ చేయకుండానే తన దైన అభిప్రాయాన్ని వెల్లడించారు. కొందరు వ్యక్తులు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఎందుకు నిరసన చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని వివరించారు. ప్రజల హక్కులు కాపాడటానికి న్యాయవ్యవస్థ దాని శాయాశక్తులు పని చేస్తున్నదని తెలిపారు. ఎవరైనా తమను విమర్శించినప్పుడు బాధ కలుగుతుందని చెప్పారు. ఆ సమయాల్లో తమను తాము సమర్థించుకోలేమని పేర్కొన్నారు.

మొత్తం మూడు దశల న్యాయవ్యవస్థ చట్టాన్ని సమర్థించిందని, సెషషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రజలకు న్యాయం అందించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాయని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios