The Kashmir Files: 'ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల‌ను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్రంగా వ్య‌తిరేకించారు. హిందువులకు వ్యతిరేకం కావద్ద‌ని, సినిమాల‌పై ప‌న్ను రాయితీ ప్ర‌క‌టించే అధికారం ఉంది కానీ,, ఇత‌రుల‌ను కించపరిచే,  అవమానించే హక్కు లేదని హిమంత శర్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.   

The Kashmir Files: 'ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల‌ను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్రంగా వ్య‌తిరేకించారు. సమాజాన్ని కించపరిచే హక్కు కేజ్రీవాల్ లేదని, విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేస్తూ.. హిందూ వ్యతిరేకిగా మారొద్ద‌ని సూచించారు. అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్శ మీడియాతో మాట్లాడుతూ..గ‌త రెండు రోజుల క్రితం.. ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను దూయ్య‌బ‌ట్టారు. బిజెపి నాయకులను సినిమాను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే.. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలని చిత్ర నిర్మాతలను కోరారు. ఈ వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎదురుదెబ్బ తగిలింది.

సినిమాల‌కు ప‌న్ను మిన‌హింపు ప్ర‌క‌టించడం కొత్త‌మి కాదు. గ‌తంలో ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా అనేక సినిమాలను పన్ను రాయితీని క‌ల్పించింది. కానీ, వివేక్ అగ్నిహోత్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఢిల్లీ ప‌న్ను మిన‌హింపు ప్ర‌క‌టించ‌లేదు.

 శర్మ మాట్లాడుతూ.. పన్ను మిన‌హింపు ప్ర‌క‌టిస్తున్నారా? లేదా ? అనేది మాత్రం మీ ప‌రిధిలో ఉండ‌నీ, ఇత‌రుల‌ను అవమానించే హక్కు మీకు లేదని కేజ్రీవాల్ ను విమ‌ర్శించారు. ఇలాంటి చ‌ర్య‌ల ద్వారా 'హిందూ వ్యతిరేకులుగా మారొంద‌నీ, మన హిందూ సమాజం.. ఈ స్థితిలో ఉందంటే దానికి కారణం మనం హిందూ కుటుంబంలోనే ఎక్కువ హిందూ వ్యతిరేకులం కాబట్టి.. లేకుంటే హిందూ నాగరికత ఒకప్పుడుల్లా ప్రపంచానికి మార్గాన్ని చూపేదని అన్నారు. 

అనుపమ్ ఖేర్ నటించిన చిత్రాన్ని యూట్యూబ్‌లో అందరికీ ఉచితంగా అందించాలనే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆసక్తిని ప్రశ్నిస్తూ.. దేశ రాజధానిలో అనేక సినిమాలను పన్ను రహితంగా రూపొందించారని గుర్తు చేశారు. ఆ సినిమాలన్నింటినీ యూట్యూబ్‌లో ఎందుకు అప్‌లోడ్ చేయమని అడగలేదని ప్ర‌శ్నించారు. కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్న మాత్ర‌మే.. యూట్యూబ్‌లో ఎందుకు అప్‌లోడ్ చేయాల‌ని ప్ర‌శ్నించారు.

అంత‌కు ముందు.. ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ చేసినా.. వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా వ్య‌తిరేఖించారు. హిందువుల గాయాల‌పై కేజ్రీవాల్ ఉప్పు చ‌ల్లుతున్నార‌నీ ఆరోపించారు. #కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై పన్ను మిన‌హింపు ప్ర‌క‌టించాల‌ను కుంటే.. చేయండి.. చేయకూడదనుకుంటే, చేయవద్దు. అంతేకానీ, కాశ్మీరీ పండిట్‌లను నిరంతరం వెక్కిరించడం ఆపండని సూచించారు.