అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు  సోమవారం నాడు ఉదయం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలోని గాంధీ చిత్రపటానికి  పూలమాల వేసి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు.

సబర్మతి ఆశ్రమంలోని పలు గదులను మోడీ ట్రంప్ దంపతులకు తిప్పి చూపించారు. గాంధీ ఉపయోగించిన రాట్నం చూపారు. గాంధీ తిప్పిన రాట్నాన్ని ట్రంప్ దంపతులు తిప్పి చూశారు. రాట్నం గురించి ట్రంప్ దంపతులకు మోడీ వివరించారు.  

Also read:అహ్మదాబాద్‌కు చేరుకొన్న ట్రంప్ దంపతులు: ఘనస్వాగతం పలికిన మోడీ

సబర్మతి ఆశ్రమ నిర్వాహకుల నుండి నూలు వడకడాన్ని  ట్రంప్ దంపతులు ఆసక్తిగా తిలకించారు. నూలు వడకడం చూసిన ట్రంప్  చూశారు.సబర్మతి ఆశ్రమంలోని అరుగు మీద  మోడీ, ట్రంప్ దంపతులు కూర్చొన్నారు.  ఆశ్రమంలో విశేషాలను ట్రంప్ దంపతులకు చూపించారు.

చెడు చూడొద్దు, చెడు మాట్లాడకూడదు, చెడు వినొద్దు అని గాంధీ సూక్తులను సూచించే మూడు కోతుల బొమ్మలను మోడీ ట్రంప్ దంపతులకు చూపించి వాటి గురించి వివరించారు. గాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ తన అభిప్రాయాన్ని అక్కడ ఉన్న పుస్తకంలో రాశారు.

ఆశ్రమయంలోని గాంధీ ఉపయోగించిన వస్తువుల గురించి ట్రంప్ దంపతులు ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు.చ