పొట్టి దుస్తులు, అభ్యంరకరమైన దుస్తులు ధరించి ఆలయానికి రాకూడదని షిమ్లాలోని ప్రసిద్ధ జైన దేవాలయం ఆదేశాలు జారీ చేసింది. అలాంటి దుస్తులు ధరించి వస్తే బయటి నుంచే నమస్కరించి వెళ్లిపోవాలని సూచించింది. 

క్రమశిక్షణ, మర్యాద, సాంస్కృతిక విలువలను కాపాడేందుకు సిమ్లాలోని శతాబ్దాల చరిత్ర కలిగిన జైన ఆలయంలోకి పొట్టి దుస్తులు ధరించిన భక్తులను నిషేధించారు. శ్రీ దిగంబర్ జైన సభ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయంలో కొత్త డ్రెస్ కోడ్ ను సూచిస్తూ ఆలయం వెలుపల ఒక నోటీసును ఉంచారు.

శ్రీరాముడి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం- ఆదిపురుష్ పై కాంగ్రెస్, ఆప్ విమర్శలు.. సస్పెన్షన్ కు బీజేపీ డిమాండ్

‘‘మహిళలు, పురుషులు అందరూ మంచి దుస్తులు ధరించి ఆలయానికి రావాలి. పొట్టి దుస్తులు, హాఫ్ ప్యాంట్, బెర్ముడా, మినీ స్కర్ట్, నైట్ సూట్, చిరిగిన జీన్స్, ఫ్రాక్, త్రీ క్వార్టర్ జీన్స్ తదితరాలు ధరించిన వారు ఆలయ ప్రాంగణం వెలుపల మాత్రమే నమస్కరించాలి’’ అని సిమ్లా జైన్ ఆలయం వెలుపల ఉన్న నోటీసులో పేర్కొన్నారు.

Scroll to load tweet…

మహిళల్లో మారుతున్న ఫ్యాషన్, వస్త్రధారణ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైన ఆలయ పూజారి ఒకరు శనివారం తెలిపారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. ‘ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ మంచి దుస్తులు ధరించాలి. దేవాలయాలను సందర్శించే అలవాటుకు ప్రజలు దూరమవుతున్నారు. నేటి కాలంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం కష్టంగా మారుతోంది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మన పెద్దలు మంచి దుస్తుల్లో దేవాలయాలను సందర్శించేవారని, కానీ ఇప్పుడు యువత, వయోజన మహిళలు పొట్టి దుస్తుల్లో లయాలను సందర్శిస్తున్నారని తెలిపారు. ఇది మంచిది కాదని అన్నారు. పాశ్చాత్య అలవాట్లు, సంస్కృతి మన మత విలువలను దెబ్బతీస్తున్నాయని తెలిపారు.

గుజరాత్, యూపీలో ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు - అసదుద్దీన్ ఒవైసీ

మత నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇతర మతాలను ఆచరించే వ్యక్తులు తమ ప్రధాన మత విశ్వాసాల నుండి ఎప్పటికీ వైదొలగరని అన్నారు. కాగా.. బట్టలపై నిషేధం శతాబ్దాల పురాతన ఆలయ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఒక భక్తుడు అభిప్రాయపడ్డారు. ‘‘పొట్టి దుస్తులను ధరించడం మన సంస్కృతి అనుమతించదు. దేవాలయాల విషయానికి వస్తే నిబంధనలు పాటించాలి. పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తూ మన సంస్కృతిని మరచిపోతున్నాం.’’ అని మరో భక్తుడు పేర్కొన్నారు.