Asianet News TeluguAsianet News Telugu

Delhi : దేశ రాజ‌ధానిలో దారుణం..ప‌నిమ‌నిషిని క్రూరంగా హింసిస్తూ..

Domestic violence: ఇంటి ప‌నిమ‌నిషిపై దారుణంగా దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో బాధిత మ‌హిళ తల, కళ్ళు, ముఖం, ఇత‌ర అవయవాలు, పొత్తికడుపుతో పాటు ఇతర శరీర భాగాలపై తీవ్రంగా గాయాల‌య్యాయి. 
 

Domestic Help, Thrashed By Delhi Couple, Found In Pool Of Urine: Report
Author
Hyderabad, First Published May 20, 2022, 4:19 PM IST

Delhi Domestic violence: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పొట్ట‌కూటి కోసం చాలా దూరం నుంచి వ‌చ్చి.. ఢిల్లీలోని ఓ ఇంట్లో ప‌నిచేయ‌డానికి వ‌చ్చిన ఓ మ‌హిళ‌పై ఇంటి య‌జ‌మానులు తీవ్రంగా దాడికి పాల్ప‌డ్డారు. ఆమెను చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తూ.. వేధించారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు బాధితురాలి గురించి గృహ‌హింస నిరోధ‌క హెల్ప్ లైన్ కు కాల్ చేయ‌డంతో ఇది వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో చోటుచేసుకుంది. 

ఈ ఘ‌ట‌న గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లో 48 సంవ‌త్స‌రాలున్న ఓ మ‌హిళ‌.. అక్క‌డి ఒక ఇంట్లో ప‌ని మ‌నిషిగా కొన‌సాగుతున్నారు. అయితే,  ఆ మహిళను ఆమె యజమానులు తీవ్రంగా కొట్టారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమె ఆమె జుట్టును కూడా క‌త్తిరించారు. ఈ ఘటన ఆదివారం జరిగింద‌ని పోలీసులు తెలిపారు. స‌ద‌రు బాధిత మ‌హిళ పేరు ర‌జినీ. ఆమె స్వ‌స్థ‌లం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి స్వ‌స్థ‌లం. ఆమె ఢిల్లీలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తోంది. నిందితులైన దంపతులు మహిళకు నెలకు ₹ 7,000 చెల్లిస్తున్నారు. అయితే, బాధిత మ‌హిళ‌ను తీవ్రంగా కొట్టారు. ఈ ఘ‌ట‌న‌లో బాధిత మ‌హిళ తల, గాయం, ఆమె కళ్ళు, ముఖం, ఇత‌ర అవయవాలు, పొత్తికడుపుతో పాటు ఇతర శరీర భాగాలపై తీవ్రంగా గాయాల‌య్యాయి. 

ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ ఘ‌ట‌న గురించి సిలిగురిలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధిత మ‌హిళ‌పై నిందితులైన దంపతులు దాడి చేశార‌ని పోలీసులు తెలిపారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) ఘనశ్యామ్ బన్సాల్ మాట్లాడుతూ.. "సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి మే 17న ఒక మహిళ  MLC (మెడికో-లీగల్ కేసు)కి సంబంధించిన సమాచారం అందింది. MLC ప్రకారం, రోగిని ఆరోపించిన చరిత్రతో ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చారు. ఆమె యజమానులు భౌతిక దాడి కార‌ణంగా మ‌హిళ ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుందని తెలిపారు. 

ఈ దాడి ఘ‌ట‌న గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఆసుపత్రికి చేరుకుని రజనీ స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. అందులో ఆమె యజమాని అభినీత్ మరియు అతని భార్య తనపై దాడి చేసి తన జుట్టును క‌త్తిరించిన‌ట్టు బాధితురాలు పేర్కొంది. స్వచ్ఛందంగా గాయపరచడం, అక్రమంగా నిర్బంధించడం, దాడి చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందిత‌ జంటను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. రజనీ అనారోగ్యంతో ఉన్నారని మరియు ఇంటికి తీసుకెళ్లాలని పేర్కొంటూ యజమానుల నుండి వారికి ఆదివారం సాయంత్రం ఆలస్యంగా కాల్ వచ్చిందని తెలిపారు. "వారు (జంట) ఆమెను (రజనీ) నా ఆఫీసు వద్ద దించి వెళ్లిపోయారు. తరువాత, ఆమె పడి ఉండటం.. ఆమె కదలకుండా  ఉండ‌టం చూసాను. ఆమెకు అనారోగ్యం లేదు.. వారు ఆమెను కొట్టారు" అని చెప్పారు. 

"నేను ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాను, అక్కడ దంపతులు ఆమెపై క్రమం తప్పకుండా దాడి చేస్తారని ఆమె నాకు చెప్పింది. ఆదివారం, ఆ జంట ఆమెను ఆమె గది నుండి బయటకు లాగి, ఆమె జుట్టును క‌త్తిరించారు. ఆమె శరీరమంతా గాయాలు ఉన్నాయి" అని చెప్పాడు. "సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ నుండి వచ్చిన వైద్య పరీక్షల నివేదికలో మహిళపై తీవ్రంగా దాడి జ‌రిగింద‌ని నిర్ధారించారు. బాధిత మ‌హిళ‌పై జ‌రిగిన దాడిలో తల గాయం అయింది. ఆమె కళ్ళు, ముఖం, అవయవాలు, పొత్తికడుపుతో పాటు ఇతర శరీర భాగాలపై కూడా గాయాలు ఉన్నాయి అని మెడిక‌ల్ రిపోర్టు పేర్కొంది. గత ఏడాది సెప్టెంబరులో ఆ మహిళ దంపతుల వద్ద పనిచేయడం ప్రారంభించిందని పోలీసులు తెలిపారు. అంత‌కు ముందు కూడా ఆ ఇంటిలో ప‌నిచేసిన ఓ ప‌నిమ‌నిషిని కూడా ఇదే విధంగా ప‌ని నుంచి తొలగించార‌ని స‌మాచారముంద‌ని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios